జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం సవరించింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ అంశాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని ప్రశ్నిస్తోంది. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భాతర నిఘా సంస్థలు అంచనావేశాయి. ఇందుకు వారు జలమార్గాన్ని ఎంచుకుంటారని తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐబీ హెచ్చరికలతో నేవీ, పోలీసు విభాగాలు అలర్టయ్యాయి.

భారతదేశానికి నదీతీరం 7 వేల 514 కిలోమీటర్లు ఉంది. ఇందులో పాకిస్థాన్‌తో కూడా నదీ తీరం ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. 2008లో సముద్రమార్గాన ముంబైలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆనాటి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించడంతో దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇందుకు జలమార్గం ద్వారానే దేశంలోకి ప్రవేశించాలని ఉగ్ర మూకలు భావిస్తున్నాయని నిఘా విభాగానికి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తీరప్రాంతల్లో రాడార్లా ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఐబీ స్పష్టంచేసింది. రెప్పపాటులో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అందుకోసం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.
ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు రౌఫ్ అజార్ దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. అతను ఇప్పటికే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వేగంగా పావులు కదుపుతున్నాడు. పీవోకేలో జైషే మహ్మద్ సంస్థ కోసం ఉగ్రవాదుల నియామక ప్రక్రియను భారీగా చేపట్టారు. ఆ క్యాంపుల నుంచి ఉగ్రవాదులను సరిహద్దు మీదుగా పంజాబ్ తరలిస్తున్నట్టు విశ్వసీనయంగా తెలిసింది. దీంతో కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని క్షణ క్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. దీనికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా ప్రకటన బలం చేకూరుస్తోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి తీసేయడంతో తాము దాడులు చేస్తామని కయ్యానికి కాలుదువ్విన సంగతి తెలిసిందే. మరి పాక్ కుట్రకు పాల్పడుతుందని ఐబి శాఖా హెచ్చరించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post అలర్ట్.. అలర్ట్.. సముద్రమార్గాన దాడికి పాక్ కుట్ర, నేవీ, పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీ appeared first on Telugu Messenger.