ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది బీజేపీ. ఇక కశ్మీర్ రెండు రాష్ట్రాలే కాదు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా.. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు తమ టార్గెట్ నెక్ట్స్ పీవోకే అనే సంకేతాలు కూడా ఇస్తోంది భారత్. అయితే ఇలాంటి దూకుడు చూపించకపోతే కచ్చితంగా, ఇక మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం అని మోదీ సర్కారు ఆలోచించింది. అసలు తమకు దైర్యం లేదు అనుకునేవారిని అణిచివేయాలని చూస్తోంది బీజేపీ అందుకే పాక్ కు సరైన జవాబు చెప్పాలని చూస్తోంది.. మహా అయితే దాడులు చేయడానికి సిద్దం అవుతారు. కాని ఆ దాడులు ఆపేలా తమ సైన్యంతో నిలువరించాలని చూస్తోంది బీజేపీ. అందుకే లక్షన్నర మంది సైన్యం మొత్తం మొహరించారు.. కశ్మీర్ ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు, అగ్రరాజ్యం కూడా ఎలాంటి మాట మాట్లాకుండా చేశారు. మొత్తానికి పాక్ ని ఈ అంశంలో కూడా నిట్టనిలువునా నిలబెట్టేశారు. మరి బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

జమ్ముకశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో రహస్య ఆపరేషన్ ఒకటి బయటకు వచ్చింది. అధికరణం 370 నిర్వీర్యం చేయటంతో పాటు.. రెండు రాష్ట్రాలుగా విభజించిన వేళ.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పెద్ద ఎత్తున భద్రతా దళాల్ని జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా మెహరించటం తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మోడీ సర్కారు చేపట్టిన మరో సీక్రెట్ ఆపరేషన్ తాజాగా బయటకు వచ్చింది. శ్రీనగర్ జైల్లో ఉన్న కరుడగట్టిన ఉగ్రవాదుల్ని.. వేర్పాటువాదుల్ని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు తరలించిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. జమ్ముకశ్మీర్ ను ఉగ్రభూతం నుంచి సంపూర్ణ విముక్తి కల్పిస్తానని నరేంద్ర మోడీ జాతికి హామీ ఇచ్చిన తర్వాతే ఈ సీక్రెట్ ఆపరేషన్ బయటకు వచ్చింది. కశ్మీర్ లోయలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే 70 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు వేర్పాటువాద నేతల్ని ప్రభుత్వం శ్రీనగర్ జైల్లో కొన్నేళ్లుగా ఉంచింది.
ఈ క్రింద వీడియో చూడండి
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 70 మంది ఖైదీల్ని వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్ లో శ్రీనగర్ నుంచి ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ పోర్ట్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని జైలుకు తరలించారు. వీరి కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగ్రాకు తరలించిన ఖైదీల వివరాలు బయటకు రాలేదు. అంతేకాదు రానున్న రోజుల్లో మరికొంతమందిని కూడా ఇదే రీతిలో ఆగ్రాకు తరలిస్తారని చెబుతున్నారు. చూడాలి మరి మోడీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. మరి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post మోడీ సర్కారు మరో సీక్రెట్ ఆపరేషన్… appeared first on Telugu Messenger.