అతి కిరాతంగా ప్లాన్ చేసి, కరుడుగట్టిన మనసుతో కిరాతకమైన మర్డర్ స్కెచ్ వేసి ప్రేమ జంటను విడదీశాడు మారుతిరావు…ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు యావత్ ప్రజలు మారుతిరావుని నిందిస్తున్నారు, అతనికి కఠిన శిక్ష వెయ్యాలని, అతను చేసిన దారుణం మరెవ్వరూ చేయకూడదు అని, అంత కఠిన శిక్షలు అమలు చేస్తేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడరు అని కోరుతున్నారు, ప్రణయ్ అమృత ల లవ్ స్టోరీ తెలుగు రాష్ట్ర ప్రజలను ఇంకా చర్చించుకునేలా చేస్తోంది, ఈ ఘటన అంత సులువుగా ఎవరూ మర్చిపోలేరు.
ఇక ప్రణయ్ హత్యపై పోరాటం ప్రారంభించారు అమృత. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని చెప్పారు. అంతేకాదు ప్రణయ్ ఆశయాన్ని నెరవేరుస్తా అన్నారు. కుల రహిత సమాజం నిర్మించడం ప్రణయ్ ఆశయం. దాని కోసం పాల్పడతాను, ఇలాంటి కులదుర అహంకార హత్యలపై పోరాటం చేస్తాను అంటోంది.మారుతిరావుకు కూతురు అమృత అంటే ఎంతో ప్రేమ ఉందట. కూతురుకి కావాల్సిన అవసరాలన్నీ దగ్గరుండి తీర్చాడు. అందుకే అమృత మీద ప్రేమతో అమృత జీనియస్ స్కూల్ ను ఏర్పాటు చేసాడు. కానీ ఇప్పుడు ఆ స్కూల్ ను ప్రణయ్ పేరిట మార్చాలని అమృత కోరుకుంటుంది.
అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు..నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ను కలిసారు. అమృత లవ్ స్టోరీ గురించి కలెక్టర్ కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువు మధ్యలోనే ఎందుకు ఆపివేశారు..? అనే ప్రశ్నలు అడిగారు. ఏం సహాయం కావాలన్న చేస్తానని చెప్పారు. అరెస్టయిన వారికి బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అమృత కోరడంతో, అందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ. 8 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని కలెక్టర్ వెళ్లడించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అంతేకాదు తన పేరిట ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని, తన తండ్రి ఆస్తులను ట్రస్టుకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమృత డిమాండ్ చేసింది. మొత్తానికి తండ్రి కూతురిమీద ప్రేమతో ఇచ్చిన ఆస్తిని కూతురైన అమృత ప్రణయ్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమృత మంచి నిర్ణయం తీసుకుంది అని, ఇలాంటి దారుణాలు చేసేవారు ఇక నైనా మారాలి అని కోరుకుంటున్నారు, మరి చూశారుగా ఇలాంటి సమయంలో అమృత ఎంత చాకచక్యంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందో, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.