ప్రస్తుతం హెచ్.ఐ.వి.ని ప్రాణాంత వ్యాధిగా చెప్పవచ్చు, ప్రపంచంలో చాలా మందిని భయపెడుతున్న వ్యాధి ఎయిడ్స్.. అయితే గతంలో కంటే ఇప్పుడు మందులు వచ్చాయి.. వారి ఆరోగ్యం మరింత మెరుగు అవుతోంది కాని లైఫ్ లాంగ్ ఈ వైరస్ వల్ల మీరు తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది… అయితే ఇఫ్పుడు ఎయిడ్స్ కంటే దారుణమైన వ్యాధిని కనుగొన్నారు వైద్యులు, ఇది హెపటైటిస్ బీ
ఇది కాలేయాన్ని కమ్మేస్తోంది. ఫలితంగా రోగి తక్కువ రోజుల్లోనే మృత్యుకోరల్లోకి చేరుకుంటున్నారు. ఇలాంటి హెపటైటిస్‌ను సకాలంలో గుర్తిస్తేనే పూర్తిగా నివారించవచ్చని లేకపోతే ప్రాణాలకే ముప్పుతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

హెపటైటిస్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. ఏ, బీ, సీ, డీ, ఈ లు. వీటిలో ఏ, ఈ మాత్రమే సాధారణమైనవి కాగా, బీసీడీ వైరస్‌లు మాత్రం ప్రాణాంతక వ్యాధులు. వీటినే క్రానిక్ హెపటైటిస్‌లుగా పిలుస్తారు.కాలేయాన్ని అతివేగంగా దెబ్బతీసే వైరస్ హెపటైటిస్-బి. ఇది ఎయిడ్స్ కంటే కూడా 4 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వల్ల లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అయితే, హెపటైటిస్ ఎ, ఇ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, బి,సి,డి రక్తం మార్పిడి ద్వారా, శరీరంలోని ద్రవాలకలయిక అంటే ఒకరు వినియోగించిన సూదులు, బ్లేడ్లను, టూత్ బ్రష్‌లను మరొకరు వినియోగించడం, సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల సంక్రమిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్టు వారు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
దీని బారినపడిన వారిలో తరచూ వాంతులు కావడం, ఆకలి మందగించడం, జ్వరం రావడం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిబారినపడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే కలుషిత నీరు తీసుకోకూడదు అలాగే మసాలా దినుసులు కలిగిన ఆహరం తీసుకోకూడదు, కాలేయం పై ప్రభావం చూపించే ఫుడ్ ఏదీ తీసుకోకూడదు, మద్యం అలవాటు మొత్తం మానెయ్యాలి, పొగాకు ఉత్పత్తులు తీసుకోకూడదు లేకపోతే అతి దారుణన జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది అని చెబుతున్నారు వైద్యులు.
The post హెచ్ఐవీని మించిన ప్రాణాంతక వ్యాధి హెచ్చరిస్తున్న వైద్యులు జాగ్రత్త appeared first on Telugu Messenger.