వ్యభిచారం చాపకింద నీరులా పాకుతోంది, గతంలో ఊరి చివరన ఎక్కడో మూల జరిగే వ్యభిచారం, ఇప్పుడు ఫ్యామిలీస్ నివాసం ఉండే చాటున ఎలాంటి అడ్డు లేకుండా జరిగిపోతోంది.. ఇటీవల పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన కాని వ్యభిచారం మాత్రం ఆగడంలేదు.ఎంత వెదికితే అంత దొరుకుతుంది అనే చందాన రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయేకాని తగ్గడం లేదు… డబ్బు వ్యామోహం కామం, విలాసాలు ఇలా అన్నింటిని తీర్చుకోవడానికి ఇలా మారిపోతున్నారు అని తెలుస్తోంది.

ఇది ఎవరి తప్పు అనే ప్రశ్న చాలా సార్లు చాలా మందికి మనసులో కలుగ వచ్చూ.కాని చట్టంలో ఎన్ని మార్పులు తెచ్చిన ఈ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ను కనిపెట్టలేక పోతుంది.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యభిచార నిర్వాకులు వారి దందాను కొనసాగిస్తున్నారు.ఈ వ్యబిచారం చేసేవారిలో ఎక్కువగా యువతులు,మధ్య వయస్సు ఆడవాళ్లు వుంటున్నారు.ఇక తాజాగా మరో హైటెక్ వ్యభిచార మూఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు..ముంబై, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకోని వివరాలు తెలుసుకుంటున్నారు.. పోలీసులని చూసిన విటులు పరారైపోయారు.నిర్వాహకుడు ఎక్కడో వుంటూ ఫోన్ ద్వారానే లావాదేవీలు నడిపిస్తుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ముంబై,బెంగళూరుకి చెందిన యువతులు ఈ నెల 20,22న విమానంలో విశాఖ నగరానికి చేరుకున్నారు.వారు విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్ హోటల్కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్ చేసి వున్న గదుల్లో దిగారు .అప్పటికే అక్కడికి చేరుకున్న విటులతో కలసి హోటల్ రూం లో తమ పని కానిచ్చుకుంటున్నా రు.ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతుండటంతో వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. పోలీసులు హోటల్పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు.విటులు మాత్రం కొద్దిసేపటికి ముందే బయటకు వెళ్లిపోవడంతో వారు తప్పించుకున్నారు.ఈ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా హైటెక్ పద్ధతిలో వ్యభిచారం జరుగుతున్న గుట్టు విప్పారు.
ఈ క్రింద వీడియో చూడండి
తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని,ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు.తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్లోనే చెబుతాడని,తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్ చేసి మెయిల్ చేసేస్తాడని వివరించారు.ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్ రూమ్ నుంచి కారు వరకూ అన్నీ బుక్ చేసి తమ ఫోన్కు వాటి వివరాలు మెసేజ్ చేస్తాడని తెలిపారు.ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని,తర్వాత రూమ్ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని,డబ్బులు మాత్రం తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు.పునరావాస కేంద్రానికి పట్టుబడిన యువతులను తరలించామని,రిషి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.. అయితే అతని ఫోన్ నెంబర్ ఆధారంగా అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి వారి మాయలో పడి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయకండని పోలీసులు హెచ్చరిస్తున్నారు, చూశారుగా ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుని వ్యభిచార దందాచేస్తున్నారో, ఇలాంటివి ఎక్కడ కనిపించినా పోలీసులకు మాత్రం వెంటనే తెలియచేయండి.
The post హైటెక్ పద్దతిలో వ్యభిచారం పోలీసులకు దొరక్కుంటా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో appeared first on Telugu Messenger.