Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు కి మావోయిస్టుల వార్నింగ్ లేఖ

$
0
0

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరావు,మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ లు మావోల చేతిలో అత్యంత దారుణంగా చంపడటంతో మావోలు మరో సారి తమ ఉనికిని చాటుకున్నారని తెలుస్తోంది…అయితే ఈ హత్యలతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది..దాదాపు 25గ్రే హౌండ్స్ దళాలు ఏజెన్సీ లో కూంబింగ్ నిర్వహిస్తోనే ఉన్నాయి.ఏపీ సీఎం చంద్రబాబు కి మావోయిస్టులు ఒక బెదిరింపు లేఖని విడుదల చేశారనే వార్తా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.మరి ఆ లెటర్ వివరాలు తెలుసుకుందామా.

కిడారి హత్య జరిగిన కారణంగా డుంబ్రి గూడ ఎస్సై అమరనాథ్ పై పోలీసులు శాఖాపరమైన చర్యలని తీసుకున్నారు..అక్కడ జరిగిన హత్యల తరువాత అల్లర్లు కంట్రోల్ చేయడంలో ఎస్సై అమరనాథ్ విఫలం అయ్యారని నిర్ధారించిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు…ఇదిలాఉంటే కిడారి శివేరి సోమ హత్యలకి ప్లాన్ చేసింది మావోల కీలక నేత అయిన ఎవోబీ మాజీ కార్యదర్శి చలపతి రావు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..అయితే తాజాగా మావోలు చంద్రబాబు ని ఉద్దేశించి బెదిరించి నట్టుగా రాశారు అనేట్టుగా పేర్కొంటున్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఆ లేఖలో ఏముందంటే..

చంద్రబాబు ఓ తేనే పూసిన కత్తి..దీని ఫలితం అనుభావిస్తావ్..నీ సంగతి తేలుస్తాం అంటూ ఆ లేఖలో మొదటి భాగంలో కనిపిస్తోంది..ఎవోబీలో జరిగిన దారుణ కాండ అంతా బాబు వ్యూహంలో భాగమని చంద్రబాబు తన పోలీసుల ద్వారా ఇదంతా చేస్తున్నారు వందలాది మందిని చంపించిన చరిత్ర నీది అంటూ లేఖలో చంద్రబాబు పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..అధికారం చేతికి రాగానే 21 మంది ఎర్రచెందనం కూలీలని పొట్టన పెట్టుకున్నావు.దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అలాగే పార్టీని వీడి పార్టీ అగ్ర నాయకత్వాన్ని నిర్మూలించడానికి చేతులు కలుపుతున్న మాజీలని కూడా మట్టు బెడుతాము అంటూ మావోలు లేఖలో తెలిపారట.కొందరు మాజీలు పోలీసులతో చేతులు కలిపి ఎంతో విలాసవంత మైన జీవితాన్ని గడుపుతూ డబ్బుకోసం గడ్డి కరుస్తున్నారని..అలాంటి వారిపై ఉదాసీనతతో వ్యవహరించడం వలెనే పరిస్థితి చేయి దాటిపోయిందని ఇక మీదట రానున్న రోజుల్లో ఎంతో ఖటినంగా ఉండబోతున్నామని లేఖలో హెచ్చరించారట…అయితే ఈ లేఖలో ఎక్కడా కూడా మావోయిస్టులకి సంభందించిన గుర్హ్తులు లేకపోవడంతో ఇది మావోలు పంపిన లేఖనా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విన్నారుగా చంద్రబాబుకు మావోలు రాసిన బహిరంగ వివరాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles