ఆ క్రికెటర్ ఆటలోనే కాదు.. సయ్యాటలోనూ ముందుంటాడు. ఆటలో దిగ్గజ క్రికెటర్ అతను. ఎందరికో ఆదర్శం ఆయన. ఆయనంత పేరు తెచ్చుకోవాలని ఎందరో కొత్త క్రికెటర్స్ ఆయనను రోల్ మోడల్ గా పెట్టుకున్నారు. అయన కూడా క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ సాధించాడు కానీ అది నాణేనికి ఒకవైపే. అతని పర్సనల్ లైఫ్ చూస్తే అందరు షాక్ అయ్యే ఘటనలే కనిపిస్తాయి. ఇంతకముందు ఒకసారి తాగి రచ్చ రచ్చ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా సెక్స్ వర్కర్స్ తో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఆయన రాసలీలల సంగతేంటో చూద్దామా.

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. తన ప్రేమికురాలితో పాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను ఏకంగా ఇంటికే పిలిపించుకుని రాసలీలల్లో మునిగిపోయాడు. తలుపులు తెరుచుకుని మరీ నానా హంగామా చేసి ఇరుగుపొరుగుకు ఇబ్బంది కలిగించాడు. మంగళవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సన్ పత్రిక కథనం ప్రకారం.. ఈస్ట్ లండన్‌లో ఉన్న తన ఇంటికి వార్న్ తన లవర్‌తోపాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లు డవీనా (19), పాపీ (27)లను పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలుపులు తెరిచే ఉంచడంతో లోపల జరుగుతున్న తతంగం మొత్తం పక్కింటి వారి కళ్లకు కట్టింది. చెవులు చిల్లులు పడే మ్యూజిక్ తోపాటు పార్టీ సందర్భంగా చేసిన గ్లాసుల గలగలలతో ఇరుగు పొరుగుకు నిద్ర కరవైంది. అనంతరం యువతులు ముగ్గురూ వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు వార్న్ చెప్పులు లేకుండానే కారులో వెళ్లిన ఫొటోలు బయటకు వచ్చాయి.
ఈ క్రింద వీడియో చూడండి
వార్న్ తీరుపై పొరిగింటి వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చర్యల వల్ల ఇరుగు పొరుగు ఇబ్బంది పడతారన్న కనీస జ్ఞానం కూడా వార్న్‌కు లేకపోయిందని మండిపడ్డారు. వార్న్ ఇంటి పక్కన గౌరవ ప్రదమైన కుటుంబాలు ఉన్నాయని, కనీసం కిటికీ తలుపులు కూడా వేసుకోకుండా పార్టీలంటూ హడావిడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులని పిలిచి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వార్న్ ఇలా వార్తల్లో నిలవడం ఇదే మొదటసారి కాదు. ఇంతకముందు కూడా బార్ లో తప్పతాగి రచ్చ రచ్చ చేశాడు. బార్ లో తాగి అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేశారు. అప్పుడు కూడా కేసు నమోదు అయ్యింది. అయితే ఇరు వర్గాలు రాజీకి రావడంతో ఆ కేసు సద్దుమణిగింది. ఇలా వార్న్ క్రికెటర్ గానే కాకుండా పలు చర్యల వలన వార్తల్లో నిలుస్తున్నారు. మరి సెక్స్ వర్కర్స్ తో వార్న్ అడ్డంగా దొరికిపోయిన ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post బయటపడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ రాసలీలలు! appeared first on Telugu Messenger.