నిద్ర సుఖమెరుగదు అంటారు. నిద్రపోవడం మొదలు పెడితే ఎంత సేపు నిద్రపోతామో మనకే తెలియదు. అయితే, ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో మనిషికి నిద్ర కరువైంది అని చెప్పొచ్చు. పని హడావుడి, ఒత్తిడి సమస్య కారణంగా మనిషి ఇబ్బంది పడుతున్నాడు. సరైన నిద్రలేకపోతే.. మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బులు వంటి సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే మనం నిద్రపోయినప్పుడు మనకు తెలీకుండా అనేక విషయాలు జరుగుతాయి. కానీ నిద్రలేచాక ఎవరైనా చెప్తే వాటిని అస్సలు నమ్మాలనిపించదు ఎందుకంటే ఏం జరిగిందో మనకు గుర్తుకుండదు కాబట్టి. అలా నిద్రలో జరిగే కొన్ని షాకింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- పెరలాసిస్…
నిద్రలో ఉన్నప్పుడు మన కండరాలు పనిచెయ్యకపోవడాన్ని చాలాసార్లు ఎక్స్ పీరియన్స్ చేసే ఉంటాం. ఒకరకంగా చూస్తే ఇది పెరలాసిస్. నిద్రలో కాలునో చేతినో కదపాలని అనుకుంటాం కానీ కడపలేము. కనీసం ఒక పక్కకు కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే..నిద్రలో మన మెదడులోని ఒక భాగం యాక్టివ్ గా ఉండి కండరాలను కదలనిచ్చే భాగం మాత్రం పనిచెయ్యదు. అందుకే బాడీని మూవ్ చెయ్యాలనుకున్నా చేయలేము. ఇలా జరిగితే దెయ్యాల ప్రభావం అని చాలామంది అనుకుంటారు.

- హిప్నిక్ జర్క్..
100 లో 70 శాతం మంది నిద్రపోయినప్పుడు కింద పడిపోతున్నట్టు, గాలిలో తేలుతున్నట్టు అనుభూతి చెందుతారు. దీనిని హిప్నిక్ జర్క్ అని అంటారు. నిద్రలేచాకా ఆ అనుభూతుని తల్చుకుని భయపడతారు. నిద్రలో కండరాలు రిలాక్స్ అవుతాయి. దీని ద్వారా కడుపులోని గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తుంటుంది. ప్రతి ఒక్కరు నిద్రలో గ్యాస్ రిలీజ్ చేస్తారు. నిద్రపోతారు కాబట్టి వారికి అది తెలీదు. నిద్రలో గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే ఎదిగే పిల్లలకు నిద్ర చాలా అవసరం అని అంటారు. బాగా నిద్రపోయే పిల్లలలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
ఈ క్రింద వీడియో చూడండి
- స్లీప్ వాక్…
దీని గురించి అందరు వినే ఉంటారు. చాలా సినిమాలో చూసే ఉంటారు. ప్రతి 1500 మందిలో ఒకరికి ఈ అలవాటు ఉంటుంది. అమెరికాలో ప్రతి సంవత్సరం స్లీప్ వాక్ వలన చనిపోతున్నారు. నిద్రలో మాట్లాడతాం కూడా. మనకు తెలిసిన వ్యక్తులతో జరిగే ఘటనలు కలలో వచ్చి వారితో మనం వాగ్వాదం చేస్తుంటాం. అలాంటి సమయంలో మనం నిద్రలో మాట్లాడతాం. మన పక్కన ఉన్నవారు చెప్తే కానీ ఈ విషయం మనకు తెలీదు. ఇది సాధారణంగా అందరిలో కనిపించే లక్షణమే. కానీ ఏం మాట్లాడతారో అది వారికి గుర్తుండదు. చాలామంది గురకపెడతారు. పిల్లలలో కంటే ఇది పెద్దలలో ఎక్కవగా ఉంటుంది. ఎక్కువ సౌండ్ చేస్తూ గురకపెట్టేవారి పక్కన పడుకోలేము. వాళ్ళు హాయిగా నిద్రపోతూ ఇతరులకు నిద్ర లేకుండా చేస్తారు.

- కిడ్నీలు నెమ్మదిస్తాయి…
మెలకువతో ఉండేటప్పుడు గంటకు ఒక్కసారైనా యూరిన్ కు వెళ్ళేవాళ్ళు రాత్రి అయితే 4, 5 గంటల వరకు ఆ అవసరం ఉండదు. దీనికి కారణం కిడ్నీలు కాస్త నెమ్మదించడమే. శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి కిడ్నీలు బయటకు పంపుతాయి. రక్తాన్ని శుద్ధి చేసే పని వల్లనే ఉదయమే యురినల్స్ కు వెళ్ళినప్పుడు యూరిన్ డార్క్ కలర్ లో ఉంటుంది. నిద్రలో శరీరం తనలో ఉన్న వ్యాధులను, నొప్పులను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నిద్రలేచాకా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది.
The post నిద్రలో మనకు తెలియకుండా జరిగే షాకింగ్ నిజాలు appeared first on Telugu Messenger.