ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై భారీగా జరిమానాలు విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటారు వాహనాల చట్టం తీసుకొచ్చింది. దీంతో రూల్స్ పాటించని వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీగా చలానాలు వసూలు చేస్తున్నారు.ప్రస్తుత నిబంధనలకు మరికొన్ని రూల్స్ ను ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు అధికారులు. కొత్త రూల్ ప్రకారం టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదు. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు… అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే.. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది మాత్రం పక్కా అని చెబుతున్నారు పోలీసులు.

ఇక ఉత్తర ప్రదేశ్ లో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా చెల్సించాలి. లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ. రెండు వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు తెలుగు రాష్ట్రాలలోనూ త్వరలో అమలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.అయితే నవభారత్ టైమ్స్ ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం ఈ రూల్ ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు విధించడం లేదని తెలిపింది. ప్రస్తుతానికి ఈ నియమాన్ని అధికారులు అమలు చేయకపోయినా త్వరలో ఇదికూడా వస్తుందని అనుకుంటున్నారు. ట్రాఫిక్ నియమాల ప్రకారంగా చెప్పులు లేదా స్లిప్పర్స్ వేసుకుని టూవీర్స్ నడపడం నేరం కిందకు వస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రింద వీడియో చూడండి
ఈ నిబంధన కూడా వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని చెబుతున్నారు అధికారులు. అయితే ఈ వార్తలపై ప్రజలు స్పందిస్తూ ‘మా భద్రత ఏంటో కానీ మా జేబులు మాత్రం బాగా ఖాళీ చేస్తున్నారని’ అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ ఇదేం రూల్ బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు .ట్రాఫిక్ కొత్త చట్టం పేరుతో జరిమానాలు విధించి ప్రజలను పీక్కు తింటున్నారని ప్రజలు విరుచుకు పడుతున్నారు. గత 9 రోజుల నుంచి జరిమాణాలపై విరుచుకు పడుతున్నారని, వీటిపై కొన్ని మార్పులు చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. ఈ చట్టం రావడంతో వాహనదారులకు ఇప్పట్లో ఉపశమనం కల్గించేలా లేవు. అయితే పోలీసుల నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి…డ్రైవింగ్ చేసే సమయంలో వాహనాలకు చెందిన కీలక పత్రాలను తీసుకెళ్లడం లేదని, అందుకే సాధారణ పౌరులకి చలాన్లు వేస్తున్నాము అని చెబుతున్నారు. అంతేకాదు దిల్లి హర్యానా యూపీలో పోలీసులకు కూడా హెల్మెట్ లేకపోవడంతో వారికి కూడా చలాన్లు వేశారు. ప్రస్తుతం రెండు నెలల వరకూ ప్రజలకు దీనిపై అవగాహన తీసుకువస్తామని తర్వాత మార్పు రాకపోతే ఫైన్లు వేస్తామంటున్నారు కొందరు ఉన్నతాధికారులు.
The post చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 15 రోజులు జైలు శిక్ష కేంద్రం మరో సంచలన నిర్ణయం appeared first on Telugu Messenger.