కుటుంబ కలహలు, అధికారం, జూదం ఇలా చెబితే వెంటనే వినిపించేది మనకు పురాణాలలో మహభారతం అనే చెప్పాలి.మహాభారతం గురించి అందరికి తెలుసు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కలహాలు రావడానికి కారణం జూదం. జూదం కారణంగానే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల కారణంగా విడిపోయారు. యుద్దాలు చేసుకున్నారు. చివరిగా కౌరవులు 100 మంది యుద్ధంలో మరణించారు. ఒకటి జూదం అయితే, మరొకటి ద్రౌపతిని జుట్టుపట్టుకుని సభకు తీసుకొచ్చి ఆమెను వివస్త్రను చేయాలనీ చూడటం. అంటే స్త్రీ పాత్ర కూడా ఇక్కడ కారణం అయింది, అయితే ఎక్కువగా జూదం అలాగే అన్నదమ్ముల కలహలు అని చెప్పాలి.
ఈ క్రింద వీడియో చూడండి
మహాభారతం హస్తినలో, కురుక్షేత్రలో జరిగితే.. ఉత్త్రర ప్రదేశ్ లో మరో మహాభారతం జరిగింది. మహాభారతంలో జూదం ఆడినట్టుగానే ఓ వ్యక్తి తన ఇంట్లో పేకాట ఆడాడు. ఆ పేకాటలో అతను డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు.. చివరకు తన భార్యను జూదంలో పెట్టాడు. మాములుగా ఎవరైనా సరే జూదంలో భార్యను పెడితే అవతల ఉన్న వ్యక్తులు ఒప్పుకోరు. ఎందుకంటే.. మహాభారతంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. అందుకే అలాంటి వాటికీ ఎవరూ ముందుకు రారు. కానీ, జూదం మత్తులో, మరొక మహిళ తమ సొంతం అవుతుంది అనే భావనలో కళ్ళుమూసుకుపోయి జూదం ఆడటం మొదలుపెట్టారు. ఆ జూదంలో ఆ వ్యక్తి తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు సదరు మహిళను చెరబట్టాలని చూశారు.

కానీ, ఆమె వారి చెర నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. కానీ, ఆమె కంప్లైంట్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఇది భార్యాభర్తల గొడవగా చెప్పి దీనిని పక్కన పెట్టారు. తనపై అత్యాచారం చేయాలని చూశారని పోలీసులకు మొరపెట్టుకున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె వాపోయింది. మరి ప్రస్తుతం అక్కడ ఏం జరగబోతుందో చూడాలి. ఇలాంటి విషయాలపట్ల యూపీ ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వాటిని రాష్ట్రంలో ఎంటర్టైన్ చెయ్యొద్దని ఇప్పటికే పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఈ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది, పోలీసులపై మహిళా సంఘాలు సీరియస్ అవడంతో వెంటనే రంగంలోకి దిగి ఐదుగురి కోసం వెతుకుతున్నారు.
The post మహాభారతం రియల్ గా జరిగింది. భార్యను జూదంలో పెట్టి ఓడిపోయాడు తర్వాత జరిగింది తెలిస్తే appeared first on Telugu Messenger.