సాధారణంగా ఎవరైనా నువ్ ఎక్కడ పుట్టావ్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఇంట్లో లేదా హాస్పిటల్ లో పుట్టానని చెప్పుకుంటారు.. కానీ రీసెంట్ గా పుట్టిన ఓ పిల్లవాడ్ని మాటలు వచ్చాకా అడిగితే ఏమని సమాధానం చెబుతాడో తెలుసా?.. నేను సింహాల గుంపుల మధ్య పుట్టాను అని తప్పకుండా చెప్పకుండా ఉండలేడు. ఇది నిజం ఎందుకుంటే ఆ పిల్లవాడు సింహాల గుంపుల మధ్యలో పుట్టాడు. ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఆ విషయం గురించి పూర్తీగా చెబుతా వినండి.
ఎక్కడో దూరాన సింహం కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు పెడతాం. మరి అలాంటిది ఏకంగా 12 సింహాలు చుట్టుముడితే. వామ్మో! ఇంకేముంది.. పై ప్రాణాలు పైనే పోతాయి. వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.పూర్తీ వివరాల్లోకి వెళ్తే..
ఓ అర్ధరాత్రి సమయంలో గుజరాత్ లోని లన్సాపూర్ గ్రామంలో ఓ నిండు గర్బిణికి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ అంబులెన్స్ కి ఫోన్ చేసి రప్పించారు.అందులో ఆమెను ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తున్నారు.అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేది సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ ఫారెస్ట్ ప్రాంతం నుంచే.వాళ్ల గ్రామానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ ఆగిపోయింది.దీంతో వారు రాత్రి సమయంలో వెళుతుండగా మూడు సింహాలు సడన్ గా వారికి ఎదురొచ్చాయి. అ వెంటనే మరో 12 సింహాలు అంబులెన్స్ ని చుట్టూ ముట్టాయి.ఓ వైపు ప్రాణభయం.. మరోవైపు నొప్పులతో బాధపడుతున్న గర్భిణి. ఎంతసేపు ఎదురుచూసినా సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ఎంత హారన్ కొట్టినా పక్కకు తప్పుకోకపోవడంతో వారికి ఏం చేయాలో అర్ధం కాలేదు. గర్భిణికి నొప్పులు కూడా ఎక్కువవడంతో ఆలస్యం చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని అంబులన్స్ లోని సిబ్బంది డాక్టర్ కు ఫోన్ చేసి ఆ సింహాలన్నీ చుట్టూ ఉండగానే వైద్య సేవలు అందించి ప్రసవం చేశారు.డెలివరీకి దాదాపు 25 నిమిషాల సమయం పట్టింది.
అంతసేపు ఆ అంబులెన్స్ సింహాల మధ్యనే ఉండిపోయిందని అమ్రేలి 108 అంబులెన్స్ సర్వీస్ హెడ్ చేతన్ గధియా తెలిపారు. సింహాలు ఆ అంబులెన్స్ పై దాడి చేయకపోవడం అదృష్టం. దేవుడి దయవల్ల బిడ్డకి , తల్లికి ఎటువంటి అపాయం జరగలేదు. ఆ తరువాత పిల్లడు పుట్టగానే ఏడ్చేశాడు. కొద్ది సేపటికి సింహాలు వెళ్లిపోవడంతో వెంటనే తల్లీ, బిడ్డను జఫ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సాధారణమట. అందుకే అంబులెన్స్లో ఉండే వాళ్లకు ముందుగానే శిక్షణ ఇస్తారు.ఆ సమయంలో బెదిరిపోకుండా నిబ్బరంగా ఎలా ఉండాలి? పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలి? అనే దానిపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని గధియా చెప్పుకొచ్చారు.ఇలా వెరైటీగా ఓ బుడ్డోడు లయన్ ల గ్రూప్ మధ్యలో జన్మించడం నిజంగా చాలా గ్రేట్ కదా.