ఈ రోజుల్లో లవర్ ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అంటున్నారు అబ్బాయిలు… ఆమె కోరిన కోరికలు తీర్చాలి ఆమె మనసు నొచ్చుకోకుండా చూడాలి, అలాగే ప్యూచర్ ని బాగా సెట్ చేసుకుని తనని పెళ్లి చేసుకోవాలి, అందుకే కొందరు ఈ తలపోటు ఎందుకు రా బాబు అని ప్రేమ జోలికి వెళ్లరు, మరికొంతమంది ఆ ప్రేమమత్తులో ఉండి పైకి రాలేక ఊగిసలాడుతారు.అయితే ఒక లవర్ జిందగీలో చాలు భయ్యా అంటారు, కాని ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 14 మంది అమ్మాయిలని తన లవ్ ట్రాప్ లో పడేశాడు, అంతేనా తన చుట్టు తిరిగేలా చేసుకున్నాడు. అంతేనా వారితో చేయాల్సింది చేశాడు, తెగ ఎంజాయ్ చేశాడు , విదేశీ ట్రిప్పులు వేశాడు, అయితే ఇంత మందిని తన లవ్ లోకి దించాడు అంటే అతని వయసు ఎంత ఉంటుంది అని అనుకుంటారు, మినిమం 30 ఉంటాయి అని అనుకుంటారు కదా.

అయితే మీరు ఆలోచించింది తప్పు ఈ కుర్రాడి వయసు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.అతడి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించిన ఇతగాడి బండారం బట్ట బయలు అయ్యింది… దీంతో ప్రేమ మత్తులో ఉన్న అమ్మాయిలు అందరూ , ప్రేమికుల రోజున ఇతడికి షాక్ ఇచ్చారు.ఆ షాక్‌తో ఏకంగా కోమాలోకి వెళ్లాడు.రఖీబ్ అనే 18 ఏళ్ల కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమలో మునిగి తేలుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు.ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అతడి గురించి అనుమానం వచ్చింది.ఫోన్‌లో అతడు వేరు వేరు అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లుగా అనుమానించిన ఆ అమ్మాయి ఒకసారి అతడి ఫోన్‌ను చాటుగా చూసింది.అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది.అలా బార్బీ గర్ల్ 1 నుండి 14 మంది నెంబర్లు ఉన్నాయి.రఖీబ్ చూడకుండా ఆ నెంబర్లన్నీ తీసుకుంది.అందరికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థం అయిన విషయం ఏంటీ అంటూ వారందరితో కూడా రఖీబ్ ప్రేమలో ఉన్నాడు.
ఈ క్రింద వీడియో చూడండి
ఆ 14 మంది కూడా ప్లాన్ చేసి ఫిబ్రవరి 14న అతడికి షాక్ ఇవ్వాలనుకున్నారు.14వ తారీకున ఉదయం రఖీబ్ లేవక ముందే అతడి ముందు నిల్చోవాలనుకున్నారు.ప్లాన్ చేసుకున్న ప్రకారం ఒక్కరొక్కరుగా అంతా కూడా అతడి ఇంటికి చేరుకున్నారు. ఉదయాన్నే అంతా కలిసి అతడి ఇంటికి వెళ్లారు.కుటుంబ సభ్యులు వారిస్తూ ఉన్నా కూడా అంతా లోనికి వెళ్లారు.అతడి రూంలోకి వెళ్లారు.అతడు అలికిడికి లేచాడు.కళ్ల ముందు 14 మంది అమ్మాయిలు, అది కూడా తాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పిన అమ్మాయిలు ఉండటంతో అవాక్కయ్యాడు.ఒక్కసారిగా వారంతా కనిపించేప్పటికి హార్ట్ వేగం పెరిగి ఏకంగా కోమాలోకి వెళ్లాడు… అయితే మాలో ఎవరిని బాగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని వారిని మాత్రమే ప్రేమించమని చెబుతాం అని అనుకున్నారట, చివరకు ప్రజర్ పెరిగి ఏకంగా కోమాలోకి వెళ్లాడు…ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి వెంటనే బాగు పడాలని ఆ 14 మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. కుర్రాడే కాని గట్టోడే అని ఆ ఇంట్లో వాళ్లు చుట్టుపక్కల వాళ్లు తెగ నవ్వుకున్నారట.
ఈ క్రింద వీడియో చూడండి
The post 14 మంది అమ్మాయిలతో ప్రేమాయణం.. అంతా ఒకేసారి రావడంతో అతడు ఏమయ్యాడో తెలుసా appeared first on Telugu Messenger.