హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణంగా చనిపోయారు. ఆఫీసులోనే పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను అన్యాయం పొట్టనపెట్టుకున్నారని.. విజయారెడ్డి మరణంతో.. తన ఇద్దరు పిల్లలు అన్యాయమై పోయారని సుభాష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

తన భార్య విజయారెడ్డి ఆఫీస్‌లో ఎంత ఒత్తిడి ఉన్నా.. ఇంటికి రాగానే మర్చిపోయేదని.. ఇంట్లో అసలు ఒత్తిడే కనిపించేది కాదన్నారు. అంతేకాదు ఆమె అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బదిలీ చేయమని కోరారని.. ఆ దిశగా ప్రయత్నాలు చేశారని గుర్తు చేసుకున్నారు. విజయారెడ్డిని బదిలీ చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని.. ఆమె బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక భూ కబ్జాదారుల కుట్ర ఉందనే ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. చనిపోయిన విజయారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈ దంపతులకు కూతురు చైత్ర, కుమారుడు భువనసాయిలు ఉన్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఇదిలా ఉంటే విజయారెడ్డికి పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పిన విషయాలు ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు, సాధారణంగా పెట్రోల్ కిరోసిన్ లాంటి ఇంధనాల ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందని , అవి మనిషికి తగిలితే ఆ మంట రెండు సెకన్లలో మనిషి శరీరాన్ని కాల్చివేస్తాయని చెబుతున్నారు వైద్యులు, అలాంటిది రెండు లీటర్ల పెట్రోల్ కిరోసిన్ కలిపి ఆమె పై పోయడంతో ఈ దారుణం జరిగింది. దాని ఇంటెన్సిటీ మరింత పెరిగింది అని తెలియచేశారు డాక్టర్లు, అంతేకాకుండా ఆమె శరీరం మొత్తం బర్న్ అయిందని అన్ని అవయవాలకు సెకన్ల వ్యవధిలోనే పెట్రోల్ అంటుకోవడంతో ఆమె వెంటనే మరణించారు అని చెప్పారు, అంతేకాకుండా ఆమె శరీరానికి 99 శాతం గాయాలు అయ్యాయి అని ఒకవేళ శ్వాసతీసుకుని ఉన్నా కొద్ది గంటలు మాత్రమే ఆమె బ్రతికే వారు అని తెలిపారు, అయితే అంత పెద్ద ఎత్తున పెట్రోల్ పోయడం రూమ్ లో బయటకు పరుగులు పెట్టి రావడం వల్ల ఆమె రెండునిమిషాల్లో సజీవదహనం అయ్యారు అని చెబుతున్నారు.. ఏది ఏమైనా ఇలాంటి సంఘటన దారుణమైని బాధపడుతున్నారు వైద్యులు. ఇక సురేష్ పరిస్దితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు, అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడని చెబుతున్నారు. మరో 48 గంటల వరకూ అతని పరిస్దితి చెప్పలేము అని తెలియచేశారు వైద్యులు.
ఈ క్రింద వీడియో చూడండి
The post విజయారెడ్డికి పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పిన విషయాలు వింటే గుండె ఆగిపోతుంది appeared first on Telugu Messenger.