తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది.నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా మారి గురువారం ఉదయం కన్నుమూశాడు, దీంతో పోలీసుల విచారణకు ఇది మరింత కష్టం అవుతోంది.
ఎమ్మార్వోపై పెట్రోల్ పోసే క్రమంలో అతనిపై కూడా పెట్రోల్ పడింది.. దీంతో 65 శాతం సురేష్ శరీరానికి కాలిన గాయాలు అయ్యాయి. మరో 72 గంటలు గడిస్తే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని చెప్పారు వైద్యులు. కాని అదే 72 గంటల్లో అతను కన్నుమూశాడు. అతని శరీర అవయవాలకు బలమైన గాయాలు అయ్యాయి.

అలాగే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి అతను కన్నుమూశాడు అని చెబుతున్నారు వైద్యులు.. ముఖ్యంగా తల భాగంలో, ఛాతీ భాగంలో సురేష్‌కు తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు గుర్తించి ట్రీట్మెంట్ అందిచారు కాని అతను కన్నుమూశాడు. అయితే సురేష్‌ను చూడటానికి ఇప్పటివరకు బంధువులెవరూ రాలేదట. కేవలం అతని భార్య మాత్రమే చివరి చూపు వరకూ ఉంది.ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ విచారణలో నిందితుడు సురేష్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు ముందు మధ్యవర్తితో రెండు రోజుల ముందే ఆమె ఇంటికెళ్ళి విజయారెడ్డి భర్తను కలిశారని సమాచారం. వారు ఎందుకు కలిశారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఏమి మాట్లాడారు..? అనే పలు అంశాలపై పోలీసులు సుభాష్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ పలు కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం. అయితే విజయారెడ్డి ఇంటికెళ్లే ముందు సురేష్ తన స్నేహితులకు కాల్ చేసి తాడో పేడో తేల్చుకుంటా అని తేల్చి చెప్పినట్లు కూడా సమాచారం. అయితే విజయారెడ్డి భర్తతో ఏమైనా డీల్ మాట్లాడాడా లేదా మరెవరైనా ఆయనతో డీల్ సెట్ చేయించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే సుభాష్ రెడ్డి మాత్రం తను కలవలేదు అని చెబుతున్నారట, భార్య ఉద్యోగి కాబట్టి భర్త ఏమైనా చక్రం తిప్పారా అనే కోణంలో
పోలీసులు విచారణ చేస్తున్నారు, కాని విజయారెడ్డి మాత్రం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఉద్యోగి అని అందరూ చెబుతున్నారు, సురేష్ మరణంతో అతని ఫోన్ కాల్ డేటా ప్రకారం ఈ కేసు విచారణ మరింత వేగవంతం చేయనున్నారు పోలీసులు.
ఈ క్రింద వీడియో చూడండి
The post హత్యకు ముందు విజయారెడ్డి భర్తను కలిసిన సురేష్ ఏం చెప్పాడంటే appeared first on Telugu Messenger.