తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఒంగోలు మహిళ సుమలత వికృత చేష్టల వ్యవహారంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఆడవాళ్లపై మోజు పెంచుకున్న సుమలత వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో వేషాలు వేసేదని పోలీసుల విచారణలో తేలింది. ఆమె మగాడిలా కనిపించేందుకు విగ్గు పెట్టుకుని, ఫ్యాంట్, షర్ట్ వేసుకునేదని పోలీసులు చెబుతున్నారు. తనకు నచ్చిన మహిళలను లోబరుచుకునేందుకు వారికి ప్రేమలేఖలు రాసేదని తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు దొరికిన ప్రేమ లేఖల్లో సుమలత తన పేరును ‘సాయి చరణ్’ అని పేర్కొన్నట్టు గుర్తించారు.

సుమలత ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు గొంతు మార్చి మగాడిలా మాట్లాడేదని, తన ట్రాప్‌లో పడిన యువతులు, బాలికలను ఇంటికి రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి, తర్వాత టాయ్స్ ద్వారా వారిపై లైంగిక దాడికి పాల్పడేదని పోలీసులు తెలుపుతున్నారు. ఆమె ఇంట్లో దొరికిన టాయ్స్, మగాళ్ల విగ్గులు చూసిన పోలీసులు సుమలత పైశాచికత్వాన్ని తెలుసుకుని విస్తుపోయారు.అయితే సుమలత పురుషుడిలా నటిస్తూ మహిళలను ఎందుకు ట్రాప్ చేసేది అన్నది మాత్రం పోలీసులకు అంతు చిక్కడం లేదు. తన వికృత లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకే ఇలాంటి పద్దతులను అనుసరించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న సుమలతను పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఓ మైనర్ బాలిక ఫిర్యాదుతో సుమలత వ్యవహారం బట్టబయలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆడవాళ్లలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
బలమైన ఆధారాలను ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమె కంఠం మగవాడిలా ఉండడంతో తలకు విగ్ ధరించి మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. తాజా కేసులో ఆమె రిమాండ్‌లో ఉంది.శుక్రవారం ఒంగోలు మారుతీనగర్‌లోని సుమలత ఇంటికి వెళ్లి సోదాలు చేసిన పోలీసులు ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. వాటిలో మూడు లేఖలు హాయ్ పేరుతో ఉండగా, మిగతా నాలుగు ‘సాయిచరణ్’ పేరుతో ఉన్నాయి. దీంతో ఆమె సాయిచరణ్ పేరుతో మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు నిర్ధారించారు.

అలాగే, ఆమె ఇంటి నుంచి మగవారు ధరించే విగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని సాయంతో ఆమె పొడవాటి జడను కప్పి ఉంచినట్టు నిర్ధారించారు. ఇక, ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ప్రేమ లేఖల్లో కింద సంతకం లేకపోవడంతో వాటిని ఎవరు రాసి ఉంటారనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితురాలు సుమలత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ‘షీ మ్యాన్’లా ఎందుకు వ్యవహరిస్తోందో తెలుసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఒంగోలు షీ మ్యాన్ సుమలత కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి appeared first on Telugu Messenger.