అర్థరాత్రి ఆడది రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని అన్నాడు గాంధీ మహాత్ముడు. కానీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా ఆడది స్వేచ్ఛగా తిరగలేకపోతుంది. మహిళల రక్షణకు ప్రభుత్వాలు చాలా పథకాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఏది కూడా వర్కౌట్ అవ్వడం లేదు. అక్కడక్కడా ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తమ ఏరియాలో మహిళలకు సేఫ్టీ ఎలా ఉందొ తెలుసుకునేందుకు ఒక మహిళా ఆఫీసర్ చేసిన పని తెలిసి అందరు మెచ్చుకుంటున్నారు.. ఆ మహిళా ఆఫీసర్ మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

కేరళ కోజికోడ్ లో డీసిపీ మెహరీన్ అనే మహిళా డిసిపిగా పనిచేస్తుంది. ఈమె తన ఏరియాలో సెక్యూరిటీ, సేఫ్టి ఏ మేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అర్థరాత్రి కోజికోడ్ బస్ట్ స్టాండ్ వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్ తో కలిసి దాదాపు అర్థగంట పాటు నిల్చుంది. వారి వద్దకు ఇద్దరు ముగ్గురు కుర్రాలు వచ్చి వారి వంక అదోలా చూస్తూ వెళ్లి పోయారు. కానీ దగ్గరకు వచ్చి అసభ్యంగా అయితే ప్రవర్తించలేదు. ఆ తర్వాత అక్కడ నుండి అలా అలా ముందుకు వెళ్లారు. చాలా చోట్ల ఆమెను కాస్త తేడాగా చూడటంతో పాటు, దగ్గరకు వచ్చి రోడ్డుపై రోడ్డుపై ఏం పని అంటూ ప్రశ్నించారు. కొందరు అయితే ఇంటికెళ్ళిపో..ఇక్కడ ఉంటె మంచిది కాదు అని చెప్పి వెళ్లిపోయారంట. మొత్తం 8 గంటల పాటు మెహరీన్ కోజికోడ్ రోడ్లపై తిరుగుతూ డ్యూటీ చేసింది. ఈ 8 గంటల డ్యూటీలో ఆమె కొందరు మంచి వారిని చుస్తే మరికొందరు ఆమెను అదోలా చూసినవారే ఉన్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఆ ఏరియాలో ఆడవారికి సెక్యూరిటీ లేదని ఆమెకు అర్థం అయ్యింది. అందుకే ఆడవారికి సెక్యూరిటీ ఇంకా పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక్క మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఆమె డిసిపి అయినా కూడా 8 గంటల పాటు మెహరీన్ రోడ్లపై తిరిగినా ఆమెను ఎవరు గుర్తుపట్టలేదు. ఈ విషయం మరుసటి రోజు జనాలకు తెలిసి అందరు షాక్ అయ్యారు. ఆమెతో మాట్లాడిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేదని చెబుతున్నారు. తమకు ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆ మహిళా ఆఫీసర్ చాలా డేరింగ్ గా అర్ధరాత్రి రోడ్డుపై తిరిగి మహిళల భద్రత గురించి తెలుసుకుంది. మహిళ పోలీసు అధికారి అయ్యి ఉండి ఆమె చేసిన సాహసం గురించి తెలిసి దేశ వ్యాప్తంగా ఆమెను అభినందిస్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
The post అర్థరాత్రి రోడ్డుపై ఆడవారికి సెక్యూరిటీ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసిన లేడీ పోలీస్ ఆఫీసర్.. నిల్చుని సెల్యూట్ చేయాల్సిందే appeared first on Telugu Messenger.