తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 48 రోజులకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆర్టీసీసమ్మె తో రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటిస్తూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది ఆర్టీసీ జేఏసీ. అటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే అటు హైకోర్టులో కూడా ఆర్టీసి సమ్మె పై ఎన్నోసార్లు విచారణలు జరిగినప్పటికే అక్కడ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకు ఆర్టీసీ కార్మికుల మనస్థాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె భవితవ్యం ఏమిటో అన్నది ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇన్ని రోజుల పాటు పోరాటం జరిపిన ఎలాంటి ఫలితం లేదని భావించిన ఆర్టీసీ జేఏసీ ఆర్టీసి సమ్మె ముగిసింది.
తమ 26 డిమాండ్ లో ఒక్క డిమాండ్ను కూడా పోరాటం ఫలితంగా సాధించకోకుండానే ఆర్టీసీ సమ్మె ముగిసింది. ప్రతి చోట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు నిరాశే ఎదురు కావడంతో కార్మికులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు సమ్మెను విరమించుకున్నారూ . సమ్మె విరమించిన తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది ఆర్టీసీ జేఏసీ . కార్మికులందరూ విధులకు హాజరైతే వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అంటూ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం ను విజ్ఞప్తి చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా నేడు మధ్యాహ్నం హైకోర్టు తీర్పుపై చర్చించిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం గౌరవించాలంటూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.
ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవ నిలబడేలా … విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన తరుణంలో ఆర్టీసీ కార్మికులకు మరో కొత్త సమస్య మొదలుకానుంది. కార్మికులందరూ ఆర్టీసీ సమ్మె చేస్తున్న కాలంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరూ సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే అంటూ ప్రకటించారు. అయితే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ డెడ్ లైన్ పెట్టినప్పటికీ ఆర్టీసీ కార్మికులు మాత్రం బేఖాతరు చేస్తూ సమ్మెను కొనసాగించారు. కాగా తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకుంటుందా లేదా.? ఒకవేళ విధుల్లోకి తీసుకుంటే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ 48 రోజుల కాలాన్ని ఎలా పరిగణిస్తుంది అన్న ప్రశ్నలతో కార్మీకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..
ఈ క్రింద వీడియో చూడండి
కార్మికులు సమ్మెకు వెళ్లడంపై ఇప్పటికీ సీఎం సీరియస్ గా ఉన్నప్పటికీ… గత 47 రోజులుగా చేస్తున్న సమ్మెకు ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారే స్వయంగా పలికిన నేపథ్యంలో..ఆయన ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కార్మికులను ఎట్లా డ్యూటీలో చేర్చుకోవాలె, ఏమేం కండిషన్లు పెట్టాలన్న దానిపై ఆలోచన చేస్తోందని.. లేబర్ కోర్టు విచారణ, తీర్పు ఎట్లా ఉంటుందన్నది అంచనా వేస్తోందని సమాచారం. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్న దానిపై తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. డ్యూటీలో చేరిన కార్మికులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వాలని కూడా భావిస్తోందని, ప్యాకేజీ ప్రకటించి మెజారిటీ కార్మికులను బయటకి పంపించాలన్న ఆలోచన చేస్తోందని సమాచారం. బేషరతుగా చేర్చుకుంటరా? సమ్మె విరమిస్తే కార్మికులను బేషరతుగా డ్యూటీలోకి తీసుకునే అవకాశముందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పలు కఠిన షరతులతో…కేసీఆర్ కార్మికుల సమ్మె ముగింపునకు ఓకే చెప్తారంటున్నారు.భవిష్యత్తులో కార్మికులు సమ్మె బాట పట్టకుండా, ఓ నిర్దిష్ట కాలం పాటు సమ్మె చేయబోమంటూ స్వయంగా ఒప్పుకునేలా షరతు విధించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా, సంస్థను సర్కారులో విలీనం చేయాలని అడగకూడదని, కార్మికులు ఆ డిమాండ్ ను శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుందన్నది కీలక షరతు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కార్మికుల నుంచి మళ్లీ ఈ డిమాండ్ రాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తపడాలని సర్కారు భావిస్తోందని సమాచారం. ‘‘ప్రతి కార్మికుడు సంతకం చేసే పేపర్ లో.. విలీనం చేయాలని ఎప్పుడూ అడగబోమనేది మొదటి షరతుగా ఉంటుంది”అని తెలుస్తోంది.
ఈ క్రింద వీడియో చూడండి
The post సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు మరో కొత్త సమస్య.. కేసీఆర్ సంచలన నిర్ణయం appeared first on Telugu Messenger.