హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ దగ్గర జరిగిన కారు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అతి వేగం అన్యాయంగా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దాదాపు 105 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు.. 19 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. కొత్త ఫ్లై ఓవర్ 40 కిలోమీటర్ల వేగం కంటే అనుమతి లేదు, అయినా సరే 105 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై పడి ఆమె ప్రాణాలను తీసింది, స్పీడుగా కారు నడిపి అమాయకురాలి ప్రాణం బలితీసుకున్నాడు ఆ వ్యక్తి.ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. లేకపోతే మరో దారుణం జరిగేది, అంతేకాదు అక్కడ రెడ్ సిగ్నల్ పడటంతో అటువైపు వాహనాలు కూడా రాలేదు, అదే సమయంలో గ్రీన్ లైట్ వెలిగి ఉంటే పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలోకలిసిపోయేవి అంటున్నారు పోలీసులు.
కారును డ్రైవింగ్ చేసిన కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు పేరిట ఆ కారు ఉంది. ఆయన ఎంపవర్ ల్యాబ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట సొంత సంస్థను నడుపుతున్నారు. ప్రమాదానికి కారణం కారును ఓవర్ స్పీడ్‌తో నడపడమేనని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చారు. వేగంగా కారు నడిపినందుకు గానూ ఈ కారుపై పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. మిలాన్ రావు మీద కేసు కూడా నమోదు చేశారు.ఈ ప్రమాదం పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజనీర్ల సూచన మేరకు ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.
ఈ క్రింద వీడియో చూడండి
ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి పేరు కల్వకుంట్ల కావడంతో.. అతడికి, సీఎం ఫ్యామిలీకి సంబంధం ఏంటని కొందరు ఆరాతీయడం ప్రారంభించారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి సీఎంకు బంధువు కావడంతోనే కేటీఆర్ ఇంత వేగంగా స్పందించారని విమర్శలు చేస్తున్నారు.అయితే దీనిని రాజకీయం చేయకూడదు అని చెబుతున్నారు కొందరు నెటిజన్లు, అయితే అతి వేగంగా వెళ్లి ఓ మహిళ ప్రాణాలు పోయేందుకు కారణం అయిన ఆ వ్యక్తి ఎంత పెద్ద కుటంబానికి చెందిన వ్యక్తి అయినా అరెస్ట్ చేసి జైలుకి పంపాలి అని కోరుతున్నారు సామాన్య జనం.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఫ్లైఓవర్ దగ్గర కారు నడిపిన వ్యక్తికి ఫైన్ ఎంత వేశారో చూడండి appeared first on Telugu Messenger.