పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ప్రపంచంలో ఏ వింత జరిగిన కూడా ఇది బ్రహ్మగారు ఎప్పుడో చెప్పారని జనాలు అంటున్నారు. మొన్నామధ్య పంది కడుపునా మేక పుట్టిందని వార్త వచ్చింది. అలాగే గేదె కడుపున కుక్క పుట్టిందని విన్నాం. ఇలాంటి రకరకాల జననాల గురించి విన్నాం. ఇప్పుడు మరొక అలాంటి జననమే జరిగింది. మరి ఇప్పుడు జరిగిన ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.
శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ వీధిలోని ఇటుకుల బట్టీ వద్ద ఉండే ఓ కుక్క ఈ మధ్యనే కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఒక కుక్క పిల్ల వింతైన ముఖంతో జన్మించింది. ఆ కుక్క పిల్ల ముఖానికి ముక్కుకు బదులు తొండం ఉంది. అది ఏనుగు పిల్లలా కనిపిస్తుండటంతో, స్థానికులు కుక్క కడుపున ఏనుగు పుట్టిందని అంటున్నారు. దాన్ని చూసేందుకు ఇరుకు పొరుగు గ్రామాల నుంచి కూడా జనాలు తరలి వస్తున్నారు. విజ్ఞాన వేత్తలు కుక్క కడుపులో ఇలా ఏనుగు తొండంతో కుక్క పిల్ల వింతగా జన్మించటంలో ఆశ్చర్యమేమీ లేదని చెబుతున్నారు. జన్యు లోపాల కారణంగానే ఈ కుక్క పిల్ల ఇలా తొండంతో పుట్టిందని విజ్ఞానవేత్తలు చెబుతున్నారు. ఏనుగు రూపంలో మాత్రమే కుక్కపిల్ల పుట్టిందని, అందరు అనుకుంటున్నట్టు అది ఏనుగు పిల్ల కాదని విజ్ఞాన వేత్తలు చెబుతున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఇక ఆ కుక్కపిల్ల పొడవైన ముక్కుతో కుక్క పిల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అది తల్లిపాలు తాగేందుకు ఇబ్బంది పడుతోందని, తామే దానికి పాలు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ.. జన్యు లోపం వల్లే కుక్క పిల్ల ఆ రూపంలో పుట్టిందని తెలిపారు. ఈ లక్షణాలతో పుట్టే కుక్క పిల్లలు బతకడం చాలా అరుదని తెలుపుతున్నారు. ఈ కుక్క పిల్లకు కళ్లు కూడా పూర్తిగా ఏర్పడలేదు. దీంతో అది సరిగా చూడలేకపోతోంది. ఇది బతుకుతుందో, చనిపోతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ దానిని బతికించడానికి డాక్టర్స్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. బ్లూ క్రాస్ వాళ్ళు కూడా ఆ కుక్కను బతికించమని, అవసరం అయినా ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఏనుగు తొండంతో పుట్టిన కుక్క పిల్ల.. శ్రీకాకుళంలో వింత appeared first on Telugu Messenger.