భూకంపాలు సునామిలతో ఇండోనేషియా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.. తాజాగా ఇండోనేషియాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందారు, భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇక ఈ సమయంలో సునామి హెచ్చిరకలు జారీ చేశారు అధికారులు..దీంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు ముందుగానే తరలించారు.శాస్త్రవేత్తల హెచ్చిరక నిజం అయింది. శుక్రవారం రాత్రి సమయంలో సునామీ ఇండోనేషియా తీరాన్ని తాకి బీభత్సం సృష్టించింది.
భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. సునామీ బీభత్సంతో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి., వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, భద్రతాదళాలు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
పౌలు నగరంలోని ప్రజలను రక్షించేందుకు అధికారులు సహాయక బృందాలను పంపించినట్లు ఇండోనేషియా మీడియా వర్గాలు వెల్లడించాయి. 2004 తర్వాత ఇండోనేషియా దీవుల్లో సునామీ రావడం ఇదే తొలిసారి. అప్పుడు సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 1,68,000 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు. 7.5 తీవ్రతతో సులవెసి ప్రాంతంలో భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొద్ది సేపటికే వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే అధికారులు హెచ్చరికలను వెనక్కి తీసుకున్న కాసేపటికే పౌలు నగరాన్ని సునామీ ముంచేసింది. సునామీ సంభవించిన విషయాన్ని అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
కాగా, స్థానిక ఇండోనేసియా కాలమానం ప్రకారం శుక్రవారం ఆరు గంటలకు ఈ భూకంపం సెంట్రల్ సులవేసి సమీపంలో వచ్చింది. భూకంపం, సునామీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు వందల మంది ఈ సునామిలో కొట్టుకుపోయారు అని అక్కడ కొన్నిమీడియాలు వెల్లడిస్తున్నాయి. భారీ రాకాసి అలల తాకిడితో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ నీరు చేరి ఇళ్లను ముంచేసింది. ఇంకా మరి కొన్ని ప్రాంతాలకు సునామి ముప్పుపొంచి ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక ఇండోనేషియాలో టూరిస్టుల రాకను కూడా ఆపేశారు అక్కడ అధికారులు గతంలో కూడా ఇలానే పెను ముప్పు సంభవించింది అని అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. చూశారుగా సునామి పై మీ సలహాలు సూచనలు కూడా ఏమైనా ఇవ్వండి తీరప్రాంత ప్రజలకు.