కొన్ని ఘటనల గురించి మనకు ఎవరైనా చెబితే అస్సలు నమ్మము.ఎందుకంటే వాళ్ళు చెప్పేవి నమ్మలేనంతగా ఉంటాయి.కొందరు అయితే మాకు దెయ్యాలు కనపడ్డాయి అని అంటారు.అయితే అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తాం.అయితే అలాంటివి నిజంగానే జరిగాయేమో ఎవరికీ తెలుసు.చదువుకున్న వాళ్ళు అయితే ఇలాంటివి అస్సలు నమ్మరు కానీ కొన్ని కొన్ని మనకు ఎదురైతేనే వాటిని నమ్ముతాము.అయితే మీరు ఇప్పటివరకు చూడని కొన్ని రికార్డింగ్ వీడియోల గురించి చెప్తా వినండి.ఇవి చేసినాక అయినా దెయ్యాలు ఉన్నాయని లేదా గాలిలో ఏదో శక్తి తిరుగుతుంటుంది నమ్ముతారని అనుకుంటున్నాం.
ఈ వీడియో చుడండి.. ఒక మహిళా లైబ్రరీలో కూర్చొని తన మొబైల్ ఫోన్ ను చెక్ చేస్తుంది.అయితే కొంచెం సేపు అయినాక ఆమె వెనుక ఏదో అలికిడి అయినట్టు ఆమెకు అనిపిస్తుంది.ఒక్కసారి ఈ వీడియోను బాగా చూస్తే ఆమె వెనుక ఉండే కుర్చీ జరుగుతుంది.ఆమె వెంటనే భయపడి ఎవరికో ఫోన్ చేయబోతుంది.అయితే ఆమె ఫోన్ చేసే సమయంలో ఏం జరిగిందంటే..ఆమెను ఎవరో లాగిపెట్టి కొట్టారు.ఎవరు కొట్టారో ఆమెకు కూడా తెలీదు.ఒక్కసారిగా కిందపడిపోయింది.ఎవరు కొట్టారో తెలియక ఆమె బిక్కు మొహం వేసుకుని చూస్తుంది.ఒక టేబుల్ దగ్గరకు వెళ్లి ఆమె ఏడవడం మీరు చూడవచ్చు.అయితే ఇదంతా అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అవ్వడంతో బయటపడింది.
ఇక నెక్స్ట్ వీడియో సంగతికి వస్తే..ఇది ఒక ఆఫీస్ లో జరిగింది.ఈ వీడియో మీరు గమనిస్తే ఒక కుర్చీ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు మెల్లగా జారుతుంది.అలా చాలా కుర్చీలు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు జారుతూ వెళ్తాయి.అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు.ఇదంతా సిసి టీవీ ఫుటేజిలో రికార్డ్ అయ్యింది.అయితే మరుసటి రోజు వచ్చి చూసే సరికి కుర్చీలన్నీ చిందరవందర ఉన్నాయి.అసలేం జరిగిందో అని భయపడి సిసి టీవీ ఫుటేజీ చూడగా ఇదంతా రికార్డ్ అయ్యింది.అలా కదలడం చూసి ఆఫీస్ స్టాఫ్ మొత్తం భయపడ్డారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇక నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే…ఇద్దరు పిల్లలు ఒక స్కూల్ లో బెంచీ మీద కూర్చున్నారు.ఇద్దరు కబుర్లు చెప్పుకుంటుండగా వాళ్ళ వెనుక ఉన్న కుర్చీలు ఒక్కసారిగా కదిలాయి.అసలు వాటిని ఎవరో జరుపుతున్నట్టు ఒకదానికొకటి గుద్దుకుని చిందరవందర అయ్యాయి.ఇది కూడా ఆ క్లాస్ రూమ్ లో ఉండే సిసి ఫుటేజిలో రికార్డ్ అయ్యింది.చూశారుగా ఈ వీడియోలు.వీటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది.ఆ వస్తువులన్నీ ఎలా కదిలాయి అనుకుంటున్నారు.ఏ శక్తివలన అవి వాటంతటికి అవే కదిలాయి.ఈ వీడియోల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.