తెలుగులో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో కొన్ని సార్లు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఈ స్కిట్లో కమెడియన్లు చేసే కామెడీ ఒక్కోసారి ప్రజలను, సామాజిక వర్గాలను, కొన్ని ప్రాంతాలకు చెందిన వారిని కించ పరిచే విధంగా ఉన్నాయనే ఆరోపణలు సైతం గతంలో వెళ్లువెత్తాయి. అంతే కాకుండా ఇందులో బూతులు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ వివాదాల నేపథ్యంలో గతంలో కమెడియన్ వేణుపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జబర్దస్త్ కామెడీషోలో కమెడియన్ అవినాష్ చేసిన స్కిట్ వివాదాస్పదం అయింది.మరి ఏమైందో ఏమో పూర్తీగా తెలుసుకుందామా.
గత శుక్రవారం ప్రసారమైన షోలో అవినాష్ చేసిన స్కిట్ కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల నుండి పొట్టకూటి కోసం గల్ఫ్ ప్రాంతాలకు వలస వెళుతున్న వారి మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.ఆ స్కిట్‌లో ముక్కు అవినాష్ జగిత్యాల ప్రాంతం బోర్డ్ పెట్టి మరీ స్కిట్ చేయడం, అందులో వాడిన డైలాగులు, పదజాలం జుగుప్సాకరంగా ఉండటం, గల్ఫ్ ప్రాంతాలకు వలస వెళ్లే వారిని అవమానించే విధంగా ఉందనే ఆగ్రహం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది. ఈ స్కిట్‌లో కొడుకును తిట్టే ఒక తల్లి వేశంలో అవినాష్ కనిపించాడు. కొడుకు రాజు పాత్రలో కార్తీక్ నటించాడు. ‘‘పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావు’ అంటూ ఆ తల్లి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో కొడుకు పాత్రదారి ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను..’ అనే వ్యాఖ్యలు చేస్తాడు.
దీంతో పొట్టకూటి కోసం వెళ్ళేవాళ్ళు సీరియస్ అవుతున్నారు.అంటే పొట్టకూటి కోసం వెళ్లే వాళ్ళ పెళ్ళాలు ఇలా చేస్తారా అని సీరియస్ అవుతున్నారు.పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్తున్న పేద ప్రజలను అవమానించే విధంగా ఈ స్కిట్ ఉందని, వెంటనే అవినాష్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి స్కిట్లను ఎంకేజ్ చేస్తున్న జబర్దస్త్ నిర్వాహకుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.క్షమాపణ చెప్పకపోతే దేనికైనా తెగిస్తాం అని అంటున్నారు.చూడాలి మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.