స్వదేశానికి వెళ్తున్నామనే సంతోషం ఆ కుటుంబంలో ఎంతోసేపు నిలవలేదు. ఐదేళ్ల చిన్నారి మార్గమధ్యంలోనే ప్రాణాలు విడవడంతో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లి, తోబుట్టులతో కలిసి కువైట్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఐదేళ్ల చిన్నారి విమానంలో తీవ్ర అస్వస్థకు గురయింది. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో విమానాన్ని ఒమన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దురదృష్టకరమైన ఈ ఘటన విమానంలో తాజాగా జరిగింది.
కడప జిల్లా రాజంపేటలోని సీతరామపురానికి చెందిన యడపల్లి శివప్రసాద్ కుటుంబంతో సహా కువైట్‌లో నివాసముంటున్నాడు. కూతురు ఐదేళ్ల యశ్వినితోసహా కుటుంబ సభ్యులంతా కువైట్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కానీ విషాదకర రీతిలో చిన్నారి యశ్విని మృతిచెందింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న బాలిక తండ్రి ఒమన్ వెళ్లి సామాజిక కార్యకర్త నల్లి హరిబాబు సహాయంతో అధికారిక లాంఛనాలన్నీ సోమవారం పూర్తి చేసి మృతదేహాన్ని చెన్నైకు పంపించాడు. విమానంలో ఆక్సిజన్ సకాలంలో అందక చిన్నారి మృతి చెందింది. చిన్నారి అనారోగ్యంతో ఉన్నట్లుగా ముందుస్తుగా ఏయిర్‌లైన్స్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇదిలావుండగా యశ్విని తండ్రి శివ కువైత్‌లోని ఒక ప్రముఖ ట్రావెల్ ఏజన్సీలో పని చేస్తున్నాడు. ‘టిక్కెటింగ్ శివ’గా పలువురికి పరిచయస్థుడు.
ఆయన కుటుంబంలో ఇలాంటి దురవార్త వినాల్సి వస్తుంది అని ఏ నాడు అనుకోలేదు అని చెబుతున్నారు అక్కడ వారు.. టిక్కెట్ శివ అనగానే ఆయనే గుర్తువస్తారు.. ఇక ఆయన కుమార్తె ఇలా ప్రమాదంలో మరణిచడం పై తీవ్ర విచారంలో శోకసంద్రంలో ఆకుటుంబం ఉంది… దీనిపై స్ధానిక నేతలు అక్కడ ఆయన బంధువులు కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని ఓదార్చారు.