Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

కన్నకూతురిని చంపేసిన తండ్రి ఇతను మారుతిరావు కంటే దుర్మార్గుడు

$
0
0

చిన్న చిన్న వివాదాల‌కు కూడా ప్రాణాలు తీస్తున్నారు కొంద‌రు మూర్ఖులు…కుటుంబ కలహాలకు ఓ చిన్నారి బలైపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే ఆమె పాలిట కాలయుడయ్యాడు. ఉన్మాదిగా మారి కూతురినే పొట్టన పెట్టుకున్నాడు.ఇంతటి ఘోరానికి పాల్పడింది తమ వూరికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అని తెలిసి ములకలచెరువు మండలం బోరెడ్డిగారిపల్లె భోరుభోరుమంటోంది. కన్న కూతురిని హత్య చేసిన శ్రీకాంత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతోంది.

ములకల చెరువు మండలంలోని బోరెడ్డిగారిపల్లె భోరు మంటోంది.బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే ఉన్మాదిగామారి పొట్టన పెట్టుకున్నాడని తెలిసి కన్నీరుమున్నీరవు తోంది. ములకలచెరువు మండలం సోంపల్లె పంచాయతీ బోరెడ్డిగారిపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, పుణ్యవతి దంపతులకు లక్ష్మీప్రసన్న, వాసు దేవరెడ్డి పిల్లలు. ములకల చెరువులోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠ శాలలో లక్ష్మీప్రసన్న టెన్త్‌ చదువుతోంది. కుమా రుడు ఐదో తరతి చదువుతున్నాడు. వీరిది వ్యవసాయ కుటుంబం.. శ్రీకాంత్‌రెడ్డి వేధింపులు తాళలేక భార్య పుణ్యవతి మొలకవారిపల్లెలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు పట్టణాల్లో పనులు చేసుకుంటున్నాడు. వీరి పిల్లలు బోరెడ్డిగారిపల్లెలోని అవ్వ లక్ష్మీ దేవి, తాత వెంకటమల్‌రెడ్డి దగ్గరుంటూ చదువుకుంటున్నారు. శ్రీకాంత్‌రెడ్డి అప్పుడ ప్పుడూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు.కూతురు చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చి కావాల్సినవి కొనిచ్చేవాడు. రెండు నెలలుగా తిరుపతిలో ఉంటోన్న శ్రీకాంత్‌రెడ్డి గతనెల 24వ తేదీన ములకలచెరువులోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు వచ్చాడు. హైదరాబాద్‌లోని హాస్టల్‌లో చేరుస్తానంటూ కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం పుణ్యవతితోపాటు అవ్వ, తాతకు తెలియలేదు. అప్పటి నుంచి బాలిక ఆచూకీ తెలియకుండా పోయింది. తన కూతురు పాఠశాలలో లేదన్న విషయం తెలుసుకున్న పుణ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త శ్రీకాంత్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 2న ఫిర్యాదు చేయడంతో బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి ఎస్‌ఐ ఈశ్వరయ్య విచారణ ప్రారంభించారు.ఆమె తండ్రి వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో విచారణ ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లోని హాస్టల్‌లో చేర్చి అక్కడే చదివించుకుంటానని కూతురు లక్ష్మీప్రసన్నను తీసుకెళ్లిన తండ్రి శ్రీకాంత్‌రెడ్డి గతంలో ఓ బోరుబండిలో పని చేసిన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలానికి వెళ్లాడు. ఈనెల 4న రాత్రి పదిగంటల సమయంలో తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివార్లలోని కన్యాకుమారి- వారణాశి జాతీయ రహదారి పక్కనున్న సైదలబండ వద్ద నున్న ఓ క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కూతురిని చావ బాది పెద్దబండరాయితో తలపై మోదాడు. కూతురు లక్ష్మీప్రసన్న చనిపోయిందనుకుని వెనుదిరిగి వచ్చాడు.అయితే తలకు, కళ్లకు బలమైన గాయాలు కావడంతో లక్ష్మీప్రసన్న రాత్రంతా కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. 5వ తేదీన తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకోవ డానికి వచ్చిన కొందరు ఆ బాలికను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

సీఐ లింగేశ్వర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్‌రెడ్డి ఈనెల 7న ఇంటికి వచ్చాడు. కొడుకు వాసుదేవరెడ్డిని తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన కుటుంబీకులు చెట్టుకు కట్టేశారు. అయితే అక్కడ నుంచి తప్పించుకుని శ్రీకాంత్‌రెడ్డి తిరుపతికి పరారయ్యాడు.
మెదక్‌ జిల్లా పోలీసులకు సవాల్‌గా మారిన బాలిక హత్య కేసును ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య ఛేదించారు.బాలికను హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈనెల 20న తిరుపతిలో శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయట పడింది. దీంతో ఎస్‌ఐ నిందితున్ని వెంటపెట్టుకుని తూప్రాన్‌కు వెళ్లడంతో చిక్కుముడి వీడింది. శ్రీకాంత్‌రెడ్డిని ఎస్‌ఐ ఈశ్వరయ్య అక్కడి పోలీసులకు అప్పగించడంతో వారు విచారణ జరుపుతున్నారు. బాలిక లక్ష్మీప్రసన్న తండ్రి చేతిలో హత్యకు గురైందని తెలియడంతో స్వగ్రామమైన బోరెడ్డిగారిపల్లె విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు. కన్న కూతురిని హత్య చేసిన శ్రీకాంత్‌రెడ్డిని శిక్షించాలని కోరుతున్నారు.గతనెల 24న పాఠశాల వద్దకు వచ్చిన శ్రీకాంత్‌రెడ్డి విద్యార్థిని లక్ష్మీప్రసన్నను వెంట తీసుకెళ్లాడని స్పెషలాఫీసర్‌ విశ్వలత, ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయని చెప్పినా వినకుండా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థిని బాగా చదువుకోవడంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపేదంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బంగారు భ‌విష్య‌త్తు ఉన్న ఆమె జీవితాన్ని ఇలా అర్ధాంత‌రంగా ముగించాడు ఆ వ్య‌క్తి. చూశారుగా ఇలాంటి వ్య‌క్తికి ఎటువంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles