తన నటనతో కామెడితో తెలుగు సినిమా ప్రజలను అలరించాడు కమెడియన్ గుండు హనుమంతరావు… ఏనాడు తనకు ఆర్ధికంగా కష్టాలు లేనట్టు ఉండేవారు.. అలాగే ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించేవారు గుండు హనుమంతురావు. కాని ఆయన తీరని విషాదాన్ని నింపి కానరాని లోకాలకు వెళ్లిపోయారు …తెలుగులో హనుమంతురావు 200 సినిమాల్లో నటించారు. ఆయన ఏ సీన్లో వచ్చినా వెండితెరపై కనిపిస్తే నవ్వులు పూయించేవారు.
ఇక వేల రూపాయల వరకూ మాత్రమే ఆయన నటించిన సినిమాలకు కమెడియన్ గా ఆయన తీసుకున్నారు.. ఇప్పుడు కోట్ల రూపాయలు వస్తున్న రెమ్యునరేషన్లు ఆనాడు లేవు అనేది తెలిసిందే. ఇక ఆలీ నిర్వహిస్తున్న ఓ టెలివిజన్ షో ద్వారా ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలుసుకున్నారు ప్రజలు. దీంతో ఆయన ఆరోగ్యం బాగాలేదు అని టాలీవుడ్ లో వారికి అప్పుడే తెలిసింది. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్నారు అని, రెండు కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పారు. ఈ షో చూసి విషయం తెలుసుకున్న చిరంజీవి గుండు హనుమంతరావుకి, రెండు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. ఇక తెలంగాణ సర్కారు కూడా ఆయనకు ఐదు లక్షల రూపాయలు అందచేసింది.
అయితే ఆయన కుటుంబంలో పెద్ద విషాదం ఆయన భార్య ఆయన కుమార్తె కూడా కొద్దికాలం క్రితం అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత ఆయన ఒంటరిగా మిగిలిపొయారు. ఆబాధ కూడా ఆయన అనారోగ్యానికి కారణం అయింది అని చెప్పాలి.. ఇక అమెరికాలో ఎం ఎస్ చదువుతున్న ఆయన కుమారుడు ఆదిత్య, తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అని హైదరాబాద్ వచ్చి, తండ్రికి తోడుగా ఉన్నాడు. ఆయనకు సేవలు చేశాడు. కాని ఆయన కోలుకోలేదు. చివరకు ఆయన చికిత్స పొందుతూ ఓరోజు కన్నుమూశారు. ఇటు తల్లి-తండ్రి -సోదరి లేకపోవడంతో అనాధగా మారిపోయాడు ఆదిత్య. అయితే వారికి బంధువులు కూడా పెద్దగా లేకపోవడంతో, ఒంటరివాడు అయ్యాడు ఆదిత్య. ఈ సమయంలో బ్రహ్మనందం గుండు హనుమంతురావు కుమారుడు ఆదిత్యకు తాను పెద్దగా ఉంటాను అని చెప్పారట. ఆయన ఆదిత్యకు ఏం సాయం కావాలి అన్నా చేస్తాను అని చెప్పారట.
తనకు నేను అండగా ఉంటాను అని ఆదిత్యని తిరిగి అమెరికా పంపించి ఎమ్మెస్ చేయించారట. ఇక అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడట ఆదిత్య ఇలా బ్రహ్మానందం ఆదిత్యాకు సాయం చేశారు అనేది కూడా, చాలా మందికి తెలియదు… ఇక త్వరలో ఆదిత్యకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అని చెప్పారట ఆయన సన్నిహితులతో. తెరపై నవ్వించడమే కాదు, ఇటు నిజంగా జీవితంలో కూడా బాధలు తీరుస్తున్న బ్రహ్మనందం గ్రేట్ అనే అనాలి..