Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

11 నెలల వయస్సులోనే పెళ్ళి చేశారు..18 ఏళ్లకు భర్తని వదలి ఆమె ఏం చేసిందో తెలిస్తే ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతారు

$
0
0

పురాతన సాంప్రదాయాలు, మడికట్టుకున్న సిద్దాంతాలు, కంచెలా మారిన కట్టుబాట్లు… వీటన్నింటి మీద విజయం సాధించింది ఆమె. అవును ఆమె గెలిచింది, మరో మహిళ ఆమెను గెలిపించింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన 19యేళ్ళ యువతి యధార్థ జీవిత గాథ ఇది.. ఏందరికో స్పూర్తిదాయకమైంది. ఆమె పేరు శాంతాదేవి మేఘ్వాల్.. ఆమె చిన్నప్పుడు అంటే 11 నెలలకే అదే ఊరికి చెందిన శాంతారామ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు.పెళ్ళి చేశారు కానీ ఆమెను అత్తగారింటికి పంపలేదు. చిన్నప్పుడే పెళ్ళి చేయడం, అమ్మాయి పెద్దమనిషి అయ్యాక ఘనంగా మరోసారి ఆ పెళ్లి వేడుకను జరపడం..అప్పుడు ఆ అమ్మాయి అత్తగారింటికి పంపడం ఇది అక్కడి సాంప్రదాయం.

సేమ్ ఇదే పరిస్థితి శాంతాదేవికి ఎదురైంది… అమ్మాయికి 18 యేళ్ళు నిండాయి కదా .. ఇక పంపించండి అంటూ వాళ్ళింటికి వచ్చి కూర్చున్నారు అత్తగారి తరఫు వాళ్లు. శాంతాదేవి షాక్ కు గురైంది. అప్పటి వరకు తనకు పెళ్ళైన సంగతి ఆమెకు తెలియదు. తనకు 11 నెలలకే పెళ్ళైందా అంటూ ఆశ్చర్యపోయింది!. నేను వెళ్లను ,అసలు నాకు ఆ పెళ్ళే ఇష్టం లేదు, , నేను టీచర్ అవ్వాలి అంటూ చెప్పేసింది అందరి ముందే శాంతాదేవి. అయినా ఆ ఇరుకుటుంబాలు విన‌లేదు ఆమెని రావాలి అని ప‌ట్టుబ‌ట్టాయి.దాని కోసం న్యాయపోరాటం స్టార్ట్ చేసింది. ఫ్యామిలీ కోర్టులో తన పెళ్ళి చెల్లదని పిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త తరఫు వాళ్ళు గ్రామ పంచాయితికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ గ్రామ పంచాయితీ..తమ పురాతర సంప్రదాయాన్ని వ్యతిరేకించినందుకు ఆమెను … కులబహిష్కరణ చేయడమే కాక సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా కూడా విధిచారు. దీంతో ఆమె కూడా దీనిపై కూడా న్యాయ‌పోరాటం చేస్తాను అని చెప్పింది.

ఈ ఘటనలో కూడా న్యాయపోరాటం గట్టిగా స్టార్ట్ చేసింది శాంతాదేవి, ఈ విషయంలో ఆమెకు బాల్య వివాహాల కార్యకర్త భారతి చాలా హెల్ప్ చేసింది. ఎన్నో వాయిదాల అనంతరం జోధ్ పూర్ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆమె వివాహాన్ని రద్దు చేస్తూ అక్టోబర్ 20న ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయితీ తీర్పు కూడా చెల్లదని స్పష్టం చేసింది ఆ కోర్టు…దీంతో శాంతాదేవి తన మొదటి లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు తన దృష్టంతా టీచర్ అవ్వడం మీదే….. దాని కోసం అహర్నిశ‌లు ప్రయత్నిస్తుంది శాంతాదేవి. అంతే కాదు బాల్యవివాహాలపై అవగాహనా కార్యక్రమాలను కూడా చేపడుతుంది.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles