విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి గాయమైన విషయం తెలిసిందే.ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. ఐపీసీ 307 (హత్యాయత్నం) సెక్షన్ కింద కేసు నమోదు చేశామనీ, ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.హాస్పిటల్ చికిత్స తీసుకుని కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు.అయితే జగన్ మీద జరిగిన దాడిని పోసాని ఖండిస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి పోసాని ఏమన్నాడో చూద్దామా..
జగన్ పై హత్యాయత్నాన్ని సినీ రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తరచుగా జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసే నటుడు పోసాని కృష్ణ మురళి ఈ ఘటన గురించి స్పందించాడు. జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల పవన్ తనకు కూడా ప్రాణ హాని ఉందని చేసిన వ్యాఖ్యలని పోసాని గుర్తు చేశారు.పవన్ ఒప్పుకుంటే ఇండియాలో ఎవ్వరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇచ్చి డేట్లు నాకు ఇవ్వండి అని అడుగుతా. పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో అంతా డిమాండ్ ఉంది..పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగితే ఏడాదికి సులభంగా 150 కోట్లు సంపాదిస్తాడు. సినిమాల్లో పవన్ కోరుకున్న విధంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ అన్నింటిని విడిచిపెట్టి.. నేను కూడా సమాజానికి సేవచేయాలి అనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారని పోసాని అన్నారు.
ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకు పవన్ మినహాయింపు కాదు. కానీ పవన్ నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. నాకు ప్రాణ హాని ఉందని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అందులో నిజం ఉండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఆయన ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించే ఆలోచన చేయాలని పోసాని అన్నారు.పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మద్దత్తు తెలిపినన్ని రోజులు రాచమర్యాదలు చేశారు. పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే ఇద్దరు మంత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి బయట ఎదురుచూశారని.. అది పవన్ స్థాయి అని పోసాని అన్నారు.కాబట్టి నేతల మీద దాడులు చెయ్యడం ఆపేయాలని పోసాని అన్నాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.