సానియా మీర్జా..పరిచయం అక్కర్లేని పేరు.టెన్నిస్ కు ఇండియాలో ఒక గుర్తింపు తెచ్చిన మహిళ.ఆటలు అంటే ఆడపిల్లలను దూరం పెట్టె మన దేశంలో పుట్టి అప్పటివరకు టెన్నిస్ గురించి సరిగ్గా తెలియని వాళ్లకు కూడా టెన్నిస్ గురించి తెలియజేస్తూ ఎన్నో టైటిల్స్ గెలుస్తూ ఎన్నో అవార్డ్స్ పొందుతూ ఇండియాలో ఉన్న ప్రతి మహిళకు ఆదర్శంగా నిలిచింది.ఎంతో ఖ్యాతి గడించిన ఆమె పెళ్లి చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతుంది.ఆమె గర్భంతో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.
సానియా మీర్జా గురించి మన అందరికి తెలిసిందే.మన దేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటిన మహిళ ఆమె.డబుల్స్ డిసిప్లీన్ లో వరల్డ్ లో నెంబర్ 1 గా నిలిచింది.పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడైన షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్ళైన తర్వాత సానియా మీర్జా జీవితం చాలా సంతోషంగా ఉంది.పెళ్ళైన తర్వాత కూడా తన ఆటను కంటిన్యూ చేసింది.ఒక పక్కన ఫామిలీ మరొక పక్కన కెరియన్ ను చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మైంటైన్ చేసింది.ఇప్పుడు సానియా మీర్జా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొడుకు పుట్టడంతో ఉబ్బితబ్బిబయిన షోయబ్ సానియా ఆరోగ్యం కూడా బాగుందని తెలిపాడు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. సానియా తల్లయిన విషయాన్ని ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సానియా దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
షోయబ్ మాలిక్ మేనేజర్ అమీన్ హక్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. తల్లిబిడ్డ చిరునవ్వులు చిందిస్తున్నారని తెలిపాడు. తొలిసారి తండ్రి కావడంతో మాలిక్ ఆనందంతో ఉన్నాడని చెప్పాడు.తాను గర్భం దాల్చానని ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ అందమైన ట్వీట్ ద్వారా తెలిపారు. గర్భం దాల్చడంతో కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధం కానుంది.మనం కూడా కామెంట్స్ రూపంలో కంగ్రాట్స్ చెబుదాం.