ఠాగూర్ సినిమాలో హైలెట్ సీన్ గుర్తుంది కదా..అదేనండి చనిపోయిన వ్యక్తిని హాస్పటల్ కి తీసుకొస్తే ఆ హాస్పటల్ యాజమాన్యం అతడికి ట్రీట్మెంట్ ఇస్తున్నామంటూ చేసే ఓవర్ యాక్షన్,డాక్టర్ ఓవర్ యాక్షన్ కి పావలా శ్యామల ఇచ్చిన రియాక్షన్స్ మర్చిపోగలమా..సీన్ చూస్తున్నంతసేపు నవ్వుతెప్పించినప్పటికి అది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం..ప్రస్తుతం హాస్పటల్స్ ధోరణిని బట్టబయలు చేసిన సీన్ అది..అచ్చం సినిమాలో మాదిరిగానే ఇప్పుడు ఒక ఘటన జరిగింది.. చనిపోయిన బిడ్డకు ఓ ఆసుపత్రిలో ఏకంగా రాత్రి అంతా వైద్య సేవలు అందించడం సంచలనంగా మారింది.మరి ఆ ఘటన గురించి ఆ నిర్వాకం చేసిన హాస్పిటల్ గురించి పూర్తీగా తెలుసుకుందామా.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆసియా బేగం అనే మహిళ నిండు గర్భిణి.తొమ్మిది నెలలుగా కడుపులో బిడ్డను మోస్తూ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కనింది.ఇక బిడ్డను కనే సమయం రానే వచ్చింది. కాన్పుకని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.తల్లికి బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగదని బందువులకు డాక్టర్స్ చెప్పారు.అయితే ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది.బ్లీడింగ్ ఎక్కువగా వుందని కాసేపు హడాహుడి చేశారు డాక్టర్లు.ఆ హడావిడి మధ్యలోనే బిడ్డ సురక్షితంగా బయటకు వస్తాడని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.పండంటి బిడ్డ కబురు చెబుతారని ఎదురు చూసిన తమకు చావు కబురు చల్లగా చెప్పారని మృతురాలు ఆసియా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.రాత్రి పది గంటలకు తమ బిడ్డ చనిపోతే సర్జరీ చేయాలంటూ ఠాగూర్ సినిమా సీన్ క్రియేట్ చేసిన డాక్టర్లు పదకొండు గంటలకు షీస్ డెడ్ అంటూ దీనంగా ఫేసు పెట్టారని మృతురాలి బంధువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆసియా విగత జీవైందంటూ వైద్య సిబ్బందితో ఘర్షణకు దిగారు. పరిస్ధితి చేయి దాటడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయక తప్పలేదు. నెల్లూరు ప్రభుత్వం ఆసుపత్రి ఛైర్మన్ స్ధానిక పెద్దలు జోక్యం చేసుకొని సర్ధి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వైరల్ కావడంతో..రోగుల ప్రాణాలు కాపాడాల్సిన హాస్పటల్స్ వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడటం ఏంటని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి.కానీ వాళ్ళ అదృష్టం బాగుండి దొరకరు వీళ్లకు దురదృష్టం పట్టి దొరుకుతారు అంతే.కాబట్టి హాస్పిటల్ వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి.లేకుంటే మీకు కూడా ఇలాగే జరగొచ్చు.