తెలుగు సినిమా ఈ మధ్య దూసుకుపోతుంది.కొత్త తరహా చిత్రాలు వస్తున్నాయి.అంతేకాకుండా అన్ని హిట్స్ వస్తున్నాయి.నటీనటులు కూడా అద్భుతంగా నటిస్తున్నారు.అయితే ఏ సినిమా చూసినా, మన తెలుగువాళ్ళ కన్నా ఇతర భాషా నటీనటులు మన తెలుగులో దూసుకుపోతున్నారు.భాష రాకున్నా సరే డైలాగ్స్ అద్భుతంగ చెప్తూ మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ సినిమా విజయంలో కీలకపాత్రం పోషిస్తున్నారు.ఈ మధ్య ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కొత్తగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అరవింద సమేతలో హీరో ఎన్టీఆర్ కి నాయనమ్మ గా నటించి, జేజీ అనిపిలిపించుకున్న మోస్ట్ టాలెంటెడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సుప్రియా పాథక్ మంచి నటన కనబరిచింది.అయితే ఆమె గురించి మీకు తెలుసా..ఆమె గురించి కొన్ని ముఖ్య విషయాలను చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.
సుప్రియా పాథక్ ది గుజరాత్.ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేతలో ఎన్టీఆర్ నయనమ్మగా నటించింది. ఈమెకు చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉండడంతో వెన్నతో పెట్టిన విద్య గా నటన మారింది. డిగ్రీ చదివే రోజుల్లో మంచి స్టేజ్ ఫెరఫార్మెన్స్ లు ఇచ్చి మంచి నటిగా రాణించింది. అది చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. 1981లో మహాభారతం స్పూర్తితో తీసిన కలియుద్ తో వెండితెరపై మెరిసింది. సుభద్ర పాత్రకు బెస్ట్ ఫిలిం ఫెర్ అవార్డు అందుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా రాణించింది.విజేత,బాజార్,మాన్సూన్,గాంధీజీ బయోపిక్ వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించింది.బుల్లి తెరపై కూడా ఎన్నో పాత్రలు వేసి ఆకట్టుకుంది.ఇక ఈమె తండ్రి ఒకప్పుడు రాజేష్ ఖన్నా,దిలీప్ కుమార్ వంటివారికి డ్రెస్ మేకర్ . ఆమె అక్క రత్నా పాథక్ కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్.
బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించడమే కాకుండా,హాలీవుడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. సుప్రియా ఒకప్పుడు మంచి నటుడు అయిన పంకజ్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈయనకు ఈమె రెండవ భార్య. పంకజ్ కపూర్ కొడుకు షాహిద్ కాపూర్ స్టార్ హీరో కావడం విశేషం. అందుకే షాహిద్ కి సుప్రియా పిన్ని అవుతుంది.పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా జరిగిన సుప్రియా,మళ్ళీ 11ఏళ్ళ తర్వాత రామ్ గోపాల్ వర్మ సర్కార్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అమితాబ్ భార్య పాత్ర,తల్లి పాత్రలో జీవించింది. రామలీల డైరెక్షన్ లో లేడీ డాన్ పాత్ర వేసి, సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అరవింద సమేతలో బామ్మగా నటించి అందరినీ ఆకట్టుకుంది.ఈమె ఇలాగె మంచి మంచి సినిమాలు చేసి అలరించాలని కోరుకుందాం.