Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఆరుగురిని పెళ్లాడిన ఈ నిత్య పెళ్లి కూతురు నాన్న, ప్రియుడితో స్కెచ్‌ ఇంకా ఈమె గురించి పూర్తీగా తెలిస్తే దిమ్మతిరుగుతుంది.

$
0
0

కులం.. మతం ఏదైనా మన దేశంలో వివాహ బంధానికి ఒక పవిత్ర త ఉంది. వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమా ణం చేసి వివాహం చేస్తుంటారు.వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు. అంతకన్నా కూడా ఎక్కువ అబద్ధాలే చెప్పి ఒక మహిళ ఏకంగా ఆరుగురిని పెళ్లాడింది. ‘బంగారం’ లాంటి భార్య దొరికిందన్న భర్త మురిపెం సాంతం తీరకుండానే, దొరికినంత బంగారం మెడలో వేసుకొని ఉడాయించేది. పుట్టింటికని బయలుదేరి.. మరో మెట్టినిల్లుపై కన్నేసేది. ఇలా మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడిన ఈ నిత్య పెళ్లి కూతురి మోసాలు పోలీసులనే నివ్వెరపరుస్తున్నాయి.మరి ఆమె గురించి ఆమె చేసిన మోసాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ప్రకాశం జిల్లా మొయిద్దీనాపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికరెడ్డి(20)కి కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి(38)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే కుమార్తెను చూడటానికి తండ్రి వచ్చాడు. తండ్రితోపాటు పుట్టినింటికి వెళ్లి, కొద్దిరోజులు గడిపి వస్తానని భర్తను మౌనిక ఒప్పించింది. ఆ సమయంలో ఎనిమిది తులాల బంగారం, రూ.30వేల నగదు సర్దుకొంది. భార్యను, మామను రామకృష్ణారెడ్డి స్వయంగా బస్సు ఎక్కించాడు. తన భర్తకు టాటా చెప్పి బస్సు ఎక్కిన మౌనిక మళ్లీ తిరిగి రాలేదు. మామగారింటికి ఫోన్‌ చేస్తే, స్పందన లేదు. దీంతో కంగారుపడిన భర్త, ఈ నెల పదో తేదీన ఖాజీపేట పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. తన భార్య ఎంతో మంచిదని, ఆమెను ఎవరో ఎత్తుకుపోయారని వాపోయాడు. దీనిపై ఖాజీపేట పోలీసులు అప్రమత్తమయి, విచారణ చేపట్టారు. మౌనిక వివరాల కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లి ఆరా తీయగా, నివ్వెరపరిచే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి.పోలీసుల విచారణలో మౌనికకు అప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు తేలింది. ప్రతి సందర్భంలో.. భర్త వద్ద కొద్దిరోజులు ఉండి, కొంత బంగారం మూటగట్టుకొని పుట్టింటికనివచ్చేసేదని గుర్తించారు. రామకృష్ణారెడ్డిలాగే, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలకు చెందిన యువకులను కూడా మోసగించి, బంగారంతో ఉడాయించినట్టు కనుగొన్నారు.

ఈ వ్యవహారంలో తండ్రి అనంతరెడ్డి, ప్రియుడు నాయక్‌ సహకరించినట్టు గుర్తించారు. ముగ్గురూ కలిసి పక్కాగా పెళ్లి కొడుకులకు వల బిగించేవారని గుర్తించారు. అందులోభాగంగా, అనంతరెడ్డి, మౌనికలు మ్యారేజ్‌ బ్యూరోలకు వెళ్లేవారు. ‘మాకు కట్నం వద్దు. స్థోమతతో పనిలేదు. అమ్మాయి బాగుంటే చాలు’ అంటూ ముందుకొచ్చేపెళ్లికొడుకుల అడ్ర్‌సలను బ్యూరో నుంచి సంపాదించేవారు. వారిని వెతుక్కొంటే వెళ్లేవారు. చూడటానికి నదురుగా ఉండటం, తండ్రికూతుళ్ల బీద పలుకులతో పెళ్లాడటానికి యువకులు ముందుకొచ్చేవారు.పైసా కట్నం తీసుకోకుండా పెళ్లాడేవారు. కొద్దిరోజులు మెట్టినింట ఎవరికీ అనుమానం రాకుండా మౌనిక ప్రవర్తించేది. ఆ తరువాత, తండ్రి రావడం, పుట్టినింటికి బయలుదేరడం షరామామూలే. ఓ ఇద్దరిని మాత్రం విడాకులు ఇచ్చి వదిలించుకొన్నదని సమాచారం. మెట్టినిల్లు నుంచి ఇవతలకు రాగానే ప్రియుడు నాయక్‌తో హైదరాబాద్‌ వెళ్లిపోతుంది. కొద్దిరోజులు అక్కడి గడిపి మరో పెళ్లికి సిద్ధమయ్యేది. మెట్టినిల్లు నుంచి వెళుతూ.. వెళుతూ.. తులమో, రెండు తులాలో తీసుకెళుతుండటంతో ఆమెపై ఎవరికీ అనుమానం రాలేదు. దీనికి భిన్నంగా రామకృష్ణారెడ్డి ఇంట్లోంచి 8 తులాల బంగారం, నగదు పట్టుకుపోవడంతో.. మౌనిక ఆట ఎట్టకేలకు కట్టింది. ఇటీవలే నాయక్‌ను ఆమె పెళ్లి చేసుకొన్నదని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ప్రియుడిని, మైదుకూరులో మౌనిక, అనంతరెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles