వివాహేతర సంబంధాలు పలు కుటుంబాల్లో విషాదం నింపుతోన్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వ్యామోహంతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను హతమార్చడానికి మహిళలు వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దురదృష్టకర ఘటనలు గత ఆరు నెలల్లో అనేకం సంభవించాయి. తాజాగా మరో మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.మరి ఆ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేలం సమీపంలో కరుప్పూర్ ఉప్పుకినరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ (40) స్థానికంగా ఓ గ్రానైట్ పరిశ్రమలో కట్టర్ మెషీన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ఐశ్వర్య (26), ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లల్ని ఇద్దర్నీ సేలంలోని ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సెల్వకుమార్ ఉద్యోగం మానేసి ఇంటిపట్టునే ఉంటున్నాడు.అదే ప్రాంతంలో నివశించే మెకానిక్‌గా పనిచేసే రవి (26) అనే యుకువడితో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన సెల్వ తన భార్యను మందలించాడు. తరచూ దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.భార్య చేస్తున్న నీచపు పని వలనే సెల్వ కుమార్ ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 10 నుంచి సెల్వకుమార్ కనిపించకుండా పోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఐశ్వర్యను అడిగితే వేరే ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్లాడని చెప్పింది. కానీ, వారి ఇంటికి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బావిలో మృతదేహాన్ని బయటకు తీయగా, అది సెల్వకుమార్‌దిగా గుర్తించారు.
మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య భయపడి తన బాబాయ్ దగ్గరకు వెళ్లి సెల్వతో ఎర్పడ్డ మనస్పర్థలు కారణంగా అతడిని కొట్టడంతో చనిపోయాడని, శవాన్ని బావిలో పారేసినట్లు చెప్పింది. తన చిన్నాన్నతో కలిసి ఐశ్వర్య పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు విచారణలో మాత్రం అసలు నిజం వెల్లడయ్యింది. మెకానిక్‌గా పనిచేస్తున్న రవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అంగీకరించింది. ఈ విషయంపై నవంబరు 10న మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపింది. భర్త తనను నిలదీయడంతో పట్టరాని ఆవేశంలో అప్పడాల కర్రతో సెల్వకుమార్‌పై దాడిచేశానని వెల్లడించింది. దాడి తర్వాత సృహ కోల్పోయిన సెల్వను రవితో కలిసి గొంతు నులిమి హత్యచేసినట్టు తెలియజేసింది. అనంతరం మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేసినట్లు వివరించింది. ఈ మేరకు వారిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ఈ మహిళా ఎంత దారుణంగా చంపేసిందో.