శశికళ… ఒక సంవత్సరం క్రితం తమిళరాజకీయాలలో బాగా వినిపించిన పేరు.అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తుంది.ముఖ్యమంత్రి కావాల్సిన శశికళ విధి వంచించడంతో జైలులో చిప్పకూడు తింటుంది.జైలులో ఆమె నెంబర్ 9936.ఈమెతో పాటు ఇళవరసి కూడా ఆ జైలులోనే శిక్ష అనుభవిస్తుంది.మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జైలు రూమ్ ను పంచుకుంటుంది.అయితే ఇప్పుడు శశికళ జైలులో ఎలా ఉందొ తెలుసా.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శశికళ జైలులో విద్యార్థిని అవతారం ఎత్తారు. మాతృభాష అయిన తమిళంను అమితంగా ఇష్టపడే ఆమె ఇప్పుడు జైల్లో కన్నడ నేర్చుకుంటున్నారు. పరప్పణ అగ్రహారంలోని సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వయోజన విద్య ద్వారా కన్నడ నేర్చుకుంటున్నారు. ఈ తరగతులకు శశికల కూడా హాజవుతున్నారు. కన్నడ రాయడం, చదవడం సాధన చేస్తున్నారు. దీంతో పాటుగా జైల్లోనే కంప్యూటర్ క్లాస్ లకు కూడా హాజరు అవుతున్నారు. ఇక ఈ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న శశికళ బంధువు జె.ఇరవరసి కూడా కన్నడ నేర్చుకంటున్నారు.శిక్షణ పూర్తి అయిన తర్వాత నిర్వహించే పరీక్షల్లో పాస్ అయితే సర్టిఫికెట్ కూడా ఇస్తామని జైలు అధికారులు వెల్లడించారు. ఇక ఇంత కాలం పార్టీ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన శశి ఇప్పుడు పుస్తకాలు తిరగేస్తున్నారు. శశికళ రెగ్యులర్ గా జైల్లోని లైబ్రరీకి వస్తుండడంతో ఇప్పటి వరకు పురుషుల కోసమే అనుమతి ఉండడంతో జైలు అధికారులు మొదట్లో ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మహిళల కోసం జైలులో ప్రత్యేకంగా లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత శశికళ ఇప్పుడు ప్రత్యేక సెల్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటరిగానే ఉండాలని యోచిస్తున్నట్లు జైలు వర్గాల సమాచారం. ఇదే కేసులో జైలులోని 2వ సెల్‌లో తన వదిన ఇళవరసితో కలిసి ఉంటున్న శశికళ.. ప్రస్తుతం 4వ నెంబర్ సెల్‌లోకి మారినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.కారిడార్‌లో కూడా మునుపటిలాగా ఆమె కనిపించడం లేదంట. ఇటీవలె ఆమెకు ఒక పెద్ద దోమ తెర కూడా ఇచ్చారంట. అందులోనే కూర్చుని ఆమె భోజనం చేస్తూ తమిళ వార్తా చానెళ్లకంటే సినిమాలే ఎక్కువగా చూస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో తమిళ పేపర్లు మాత్రం చదువుతున్నారని సమాచారం.
ఇక భోజనం విషయానికి వస్తే రోజు రెండు చపాతీలు ఒక రాగిముద్ద 200 గ్రాముల అన్నం 150 గ్రాముల సాంబార్ మాత్రమే ఆమెకు సర్వు చేస్తున్నారు. ఇక రోజంతా ఖాళీగా ఉంటా అంటే కుదరదు.. రోజు కనీసం 100 కొవ్వత్తులనైనా తయారుచేయాలి. ఇందుకోసం ఆమెకు రోజు 50 రూపాయల కూలి ఇస్తారు. విధి అంటే ఇదే. నిన్నమొన్నటివరకు రాజభోగాలు అనుభవించిన ఆమె ఇప్పుడు జైలులో కష్టాలు పడుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. శశికళ గురించి అలాగే ఆమె ఇప్పుడు జైలులో అనుభవిస్తున్న జీవితం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్