తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది.అనసూయ రష్మిలు యాంకర్స్ గా పేరుపొందడానికి జబర్దస్త్ కారణం అనే చెప్పుకోవాలి. కామెడీ షో కు కొంత గ్లామర్ జోడించినా ఈ ముద్దు గుమ్మాల కోసం షో చూసే వాళ్ళు ఉంటారు.వీళ్లకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది జబర్దస్త్.అయితే ఇప్పుడు అనసూయ చేసిన ఒక పని అందరి చేత విమర్శలు వచ్చేలా చేసింది. మరి అనసూయ ఏం చేసిందో చూద్దామా.
బుల్లితెర మీద అద్భుతమైన కామెడీతో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురుచూస్తారు.జబర్దస్త్ షో లో పంచులు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.అవి డబల్ మీనింగ్ కావొచ్చు నాన్ వెజ్ కావొచ్చు మరే ఇతర జోక్స్ కావొచ్చు.చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఆ షో కు అడిక్ట్ అయ్యారు.ఈ షోలో ఎవరు మిస్ అయినా ఫామిలీ మెంబర్ మిస్ అయ్యినట్టు ఫీల్ అవుతారు జనం.అలా ఈ షో అట్రాక్ చేసేసింది.కొన్నిరోజులు అనసూయ కనపడకపోయే సరికి అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిందేమో అనుకున్నారు. ఎలా గుడ్ బై చెప్తారు.లైఫ్ ఇచ్చిన షో కదా.అందుకే ఎన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఎన్ని ఆఫర్స్ వచ్చిన బ్రేక్ ఇస్తుంది కానీ మానేయడం మాత్రం అస్సలు జరగడం లేదు.మొన్న చిన్న బ్రేక్ ఇచ్చిన అనసూయ మళ్ళి ఎంట్రీ ఇచ్చింది.
నిన్న ఎంట్రీ ఇచ్చిన అనసూయను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు నెటిజన్స్. అనసూయ వచ్చింది కానీ మాములుగా వచ్చిందా..ఆ డ్రెస్ చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు.రావడం అయితే వచ్చింది కానీ మరి ఇంత ఘోరంగానా.వర్షిణి మేలు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఎంత పాపులర్ స్టార్ ఐన మరి ఇంత అసభ్యంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.ఉండాలి గ్లామర్ షో కానీ మరి వీపరీతంగా ఉండకూడదు.ఆమె వేసుకున్న డ్రెస్ కు ఇంతలా ట్రోలింగ్ రావడం చూసి ఆమెకు కొందరు సజెషన్స్ కూడా ఇస్తున్నారు.ఏజ్ పెరుగుతుంది అనే మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా అలాంటి బట్టలు వేసుకోడానికి సిగ్గు లేదా అని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యామిలీతో చూసే షో లో జోక్స్ ఓకే గానీ ఇలా ఘోరంగా డ్రెస్ సెన్స్ లేకుంటే ఎలా అంటూ కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఇప్పుడు కూడా ఇంత గ్లామర్ షో అవసరమా అని అంటున్నారు.