ఈ రోజుల్లో టెక్నాలజీ ద్వారానే యువత డబ్బులు సంపాదిస్తున్నారు స్టార్టప్స్ ఎన్నో వేల కోట్లరూపాయల కంపెనీలుగా మారుతున్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఇంటర్ నెట్ ద్వారా డబ్బు సంపాదించే సౌలభ్యం వచ్చింది ..మరి ఆ టెక్నిక్ లు ఏమిటి, ఇలా డబ్బులు సంపాదించేందుకు ఉన్న మార్గాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1. యూట్యూబ్ ద్వారా: డబ్బు సంపాదించడం జియో 4జీ నెట్ ప్రభంజనం మొదలుపెట్టినప్పటి నుంచి మనోళ్లు వీడియోలు చూడటం బాగా ఎక్కువైంది. మనం రోజూ YouTube లో వీడియో చూస్తూ వుంటాం కదా ? అలా మనలో ఉన్న ప్రతిభ ను వీడియోల రూపంలో బయటపెట్టి , డబ్బు సంపాదించవచ్చు. గూగుల్ యాడ్‌సెన్స్ కేవలం ఒక రోజు లోపే అప్రూవ్ అవుతుంది. దీనిలో పెద్దగా కష్టపడటానికి ఏమీ ఉండదు. వీడియోలు తయారుచేసి Upload చేయడమే మన పని. మనకు ఉన్న టాలెంట్ ఏదైనా ఇమేజ్‌లను వీడియో చేసి లేదా ప్రత్యక్షంగా షార్ట్ ఫిల్మ్ లాంటి వీడియోలను తయారుచేసి అప్‌లోడ్ చేయొచ్చు. అయితే వీడియోలు మన సొంత వీడియోలు అయి ఉండాలి. ఇతర యూట్యూబ్ వీడియోలు, వేరే టీవీ చానెళ్ల వీడియోలు డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి పెట్టకూడదు. మన మొబైల్ లేదా వీడియో కెమెరాతో Shoot చేసిన మన సొంత వీడియోలు , లేదా మన కంప్యూటర్ లో Screen Recording software ద్వారా చేసిన వీడియోలను తయారుచేయవచ్చు. మనకు సొంతంగా రెండు YouTube ఛానళ్లు ఉన్నా కూడా, ఒక చానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు మరొక చానళ్‌లో అప్లోడ్ చేయకూడదు.
2. సొంత వెబ్‌సైట్: (డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్) చాలా మంది సొంత వెబ్‌సైట్ అనగానే వెబ్‌సైట్ పేరు కొనుక్కోవాలి, మళ్లీ దానికి హోస్టింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు ఇలా అనుకుంటూ ఇది మనతో అయ్యే పనికాదు అని భావిస్తారు.ఇప్పుడు కొంత సాంకేతిక విషయాలపై అవగాహన ఉన్నవారికి వెబ్‌సైట్ తయారుచేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. Google బ్లాగర్ మాదిరిగా WordPress లో కూడా బ్లాగు ను తయారు చేసుకోవచ్చు. Google బ్లాగర్ బ్లాగు ఎలా తయారు చేయాలో చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్‌సైట్లలో దాదాపు 30% వెబ్‌సైట్లు వర్డ్‌ప్రెస్(WordPress)లో ఉన్నాయి. మొదటి వర్డ్ ప్రస్ బ్లాగ్ 2013లో ప్రారంభించబడింది. దీనిలో లభ్యమయ్యే కొన్ని వందల ఫ్రీ, ప్రీమియం టెంప్లేట్‌ల ద్వారా మనకు నచ్చిన టెంప్లేట్ ఎంచుకొని బ్లాగుని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంకా ఇంటర్నెట్లో వేలకొద్దీ ఉచిత ప్లగ్ఇన్‌లు లభ్యమవుతాయి. వీటి ద్వారా బ్లాగుని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. అందులో మీకు ప్రావీణ్యం ఉన్న కంటెంట్‌ను పెట్టడం ద్వారా గూగుల్ యాడ్స్‌ను తెచ్చుకోవచ్చు. ఈ విధంగా వీక్షకుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా యాడ్ రెవెన్యూ సంపాదించవచ్చు..
3. బ్లాగింగ్: (డిజైనింగ్, మార్కెటింగ్) వెబ్‌సైట్ లేదా బ్లాగు ద్వారా డబ్బు ఎలా ఆర్జించవచ్చో తెలుసుకున్నాం. దాని కోసం బ్లాగు ఒకటి ఉంటే సపోర్టింగ్‌గా ఉంటుంది. బ్లాగులు సైతం ఎవరి ప్రోత్సాహం అక్కర్లేకుండా మనమే తయారుచేసుకోవచ్చు. దాని కోసం గూగుల్ నుంచి Blogger మరియు wordpress సర్వీసులు ఉచితం గా లభ్యమవుతున్నాయి. కానీ మనకు ఇక్కడ సొంత డొమైన్ కాకుండా వెబ్‌సైట్ చివరన blogspot.com లేదా wordpress.com అని జోడించబడుతాయి.అదే మన సొంత వెబ్‌సైట్లు అయితే మనం పెట్టుకున్న పేరు చివరన డాట్ కామ్ అని ఉంటుంది.
4. అఫిలియేట్ మార్కెటింగ్: అపిలియేట్ మార్కెటింగ్‌లో అన్నింటికంటే ముఖ్యమైన విషయం మార్కెట్లో వస్తున్న కొత్త సాంకేతిక విధానాలపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ బేసిక్స్ తెలిసుండాలి. ఇంటర్నెట్‌పై అవగాహన తప్పనిసరి. వివిధ సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్‌సైట్లపై పట్టు ఉండాలి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ప్రాడక్ట్ లేదా సర్వీస్‌ను ఇంకొకరికి రెఫర్ చేసి కమీషన్ సంపాదించడం. ఇది ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయ మార్కెటింగ్ లాంటిదే. కాకపోతే టెక్నాలజీ రాకతో బ్లాగ్‌లు, ఫేస్బుక్ పేజీల ద్వారా కొత్త రూపు సంతరించుకుంది. ఇండియాలో చాలా మంది యువత అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇది కూడా మంచి సంపాదన మార్గం.
5. ఫ్రీ లాన్సింగ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక చోటకు తెచ్చి కలిపితే స్మార్ట్‌ఫోన్ దాన్ని ఒక కుగ్రామం కింద మార్చేసింది. అదేంటో ఊర్లలో రచ్చబండ కింద పది మంది కూర్చొని మాట్లాడుకున్నట్లు, ఉన్న చోట నుంచే ఏ దేశంలో వారితోనైనా సంభాషించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్ అవకాశం కల్పిస్తుంది. ఇదే నేడు మన పాలిట కల్పవృక్షం అయింది.. ఉద్యోగం ఎందుకు బోర్ కొడుతోంది అనుకునేవారు ఫ్రీ లాన్సింగ్‌ను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇంట్లోనే కూర్చొని చేసే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు, మన సొంత ఇంటి నుంచి కదలకుండా, సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్‌లో Elance, Freelancer(Freelancer.com) లాంటి వెబ్‌సైట్లు మీకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీకు పట్టున్న సబ్జెక్టులో క్లైంట్‌కు అవసరమైన సమాచారాన్ని రాసి ఇవ్వడమే.
6. మంచి ఆన్లైన్ ఐడియాలు: జులై నెల నుంచి ఎక్కడ చూసినా జీఎస్టీ అనేది వ్యాపార వర్గాల్లో వినిపిస్తుంది. ఒక సంస్థ నుంచి ప్రాడక్టు లేదా సర్వీసు తీసుకుని దానికి ఆన్లైన్లో కస్టమర్లు వచ్చేలా చేసి డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుత కాలంలో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఇంతకుముందు మధ్యవర్తిత్వం చేసేవారిని బ్రోకర్ అని అంటూ వారిని ఏదో చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు ఈ విధంగా పెళ్లిళ్ల మధ్యవర్తిత్వం బాగా ఎక్కువైపోయింది. బిజీ జీవితాల్లో పిల్లల వివాహం చేసేందుకు సమయం ఉండక, పెద్దగా పరిచయాలు లేక వివాహ వేదికలను ఆధునిక దంపతులు ఆశ్రయిస్తున్నారు. దీన్ని మీరు సైతం ఒక ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. దీనికి మీరు తొందరపడి ఏదేదో చేయకండా ఒక ఫేస్‌బుక్ గ్రూప్ లాంటిది ఏర్పాటు చేసుకోవడంతో మీ పని మొదలుపెట్టండి. అందులో కొంత మంది ఫ్రెండ్స్‌ను యాడ్ చేయండి, అందులో ఎవరికి ఏ టైపు ఏ కులం అమ్మాయి లేదా అబ్బాయి కావాలి అనే సమాచారం తీసుకుని సమగ్రంగా ఉంచండి. మొదట గ్రూప్‌లో అందరితో నిత్యం టచ్‌లో ఉంటూ అభిరుచులను తెలుసుకోండి. ముందు మధ్యవర్తిగా పెళ్లిళ్లు కుదర్చడానికి ప్రయత్నించండి. మొదట ఉచితంగా ఈ సేవలు అందించాలి. కాస్త పేరు తెచ్చుకున్నాక సొంత వెబ్‌సైట్ తయారుచేసుకోండి. ఇంకొంచెం రోజులకి ఎవరైనా మీ వద్ద సమాచారాన్ని తీసుకునేందుకు కొంచెం డబ్బు పేమెంట్ చేస్తేనే ముందుకెళ్లెలా ఏర్పాట్లు చేసుకోండి. కొద్ది రోజులకి వధూవరుల సమాచారం ఒక బుక్ ప్రింట్‌చేసి అమ్మండి. మీకు వీలైతే సామర్థ్యం ఉంటే వివాహ వేదికలను నిర్వహించండి. అందులో కొన్ని ప్రకటనలు వేస్తామని కొంత మంది దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ఎంఎస్‌లను పంపడం ద్వారా ఉన్న చోట నుంచే ఒక చిన్న కార్యాలయం నుంచే ఆన్లైన్ మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌ను రన్ చేయవచ్చు.
7. గూగుల్ యాడ్‌సెన్స్ థర్డ్ పార్టీ అడ్వర్టైజర్లు బాగా ట్రాఫిక్ ఉన్న వెబ్‌సైట్లలో యాడ్ స్పేస్‌ను బుక్ చేసుకుంటారు. ఆయా స్పేస్లో మనం యాడ్‌లు ఇచ్చుకోవచ్చు. అది మన వెబ్‌సైట్ అయినా కావచ్చు, లేదా ఇతర వెబ్‌సైట్ కావచ్చు. కావాలంటే యాడ్ స్పేస్‌ను ఆన్లైన్లో కొనేసి మధ్యవర్తిగా ఉంటూ కూడా డబ్బు ఆర్జించవచ్చు.
8. డొమైన్ బ్లాకింగ్ : డొమైన్ల బుకింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? ఎక్కువగా ఆన్లైన్‌లో సమాచారం శోధించే వారికి ఇది పనికొస్తుంది. వెబ్‌సైట్ డొమైన్(వెబ్‌సైట్ పేరు) ఎలా బుక్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. అలానే వెబ్‌సైట్ డొమైన్ ఎంపిక చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెబ్‌సైట్ డొమైన్ సెక్యూరిటీ పెంచుకోవచ్చు. అలానే మనకు అసవరం లేని సర్వీసులు కొనకుండా జాగ్రత్తపడాలి. ఈ మధ్య చాలా డొమైన్ సరఫరా వెబ్‌సైట్లు వెబ్‌సైట్ డొమైన్ పేరుతో అదనపు సర్వీసులను అవసరం లేకుండానే అంటగడుతున్నాయి. వెబ్‌సైట్ డొమైన్ బుకింగ్ కోసం ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వెబ్‌సైట్ godaddy అన్న సంగతి మర్చిపోకండి.
9. గ్రాఫిక్ డిజైనర్: మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే లేదా కోడ్ రాయడం ఎలాగో తెలిస్తే మిమ్మల్ని ఆన్‌లైన్‌లో తమ పని చేసేందుకు నియమించుకోగల వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఒక ఫ్రీలాన్సర్లా మీరు సమయాన్ని నిర్వహించుకుని, మీరు ఎవరి కోసం పనిచేస్తారో నిర్ణయించుకుని, ఎంచుకోండి. మీ ధరను నిర్ణయించుకుని, ప్రాజెక్టులను ఎంచుకోండి. సౌకర్యవంతమైన జీవనశైలి ఇదివరకే మీరు సాధించినప్పుడు మీరు ఇష్టపడే పనిని ముగిస్తారు. ప్రతి పరిశ్రమలో లానే ఫ్రీలాన్సర్‌లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఒక ఫ్రీలాన్సర్‌ని నియామకం చేసేటప్పుడు ఈ చిట్కాలను గమనించండి. నియమాకం పొందేటప్పుడు వారు ఏమేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
10. హోస్టింగ్: ఇంట్లో నుండే కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే డబ్బు సంపాదించడం సులువు అయిపోయింది. ఆన్లైన్లో వెబ్‌సైట్ల కోసం హోస్టింగ్ స్పేస్ ఉండాలి. చాలా మంది ఇప్పుడిప్పుడే వెబ్‌సైట్లను చేసుకునేవారికి హోస్టింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు. దీన్నే అవకాశంగా మలచుకుని హోస్టింగ్ స్పేస్‌ను బ్లాక్ చేసుకుని తద్వారా దాన్ని మళ్లీ అవసరమైన వాళ్లకు అమ్ముకుని డబ్బు చేసుకోవచ్చు. చూశారుగా తక్కువ పెట్టుబడితో కొన్ని అలాగే పెట్టుబడి లేకుండా మీ టాలెంట్ తో కొన్ని టెక్నిక్ లు ఎలా ఉన్నాయో… మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ సన్నిహితులకు షేర్ చేయండి.