తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బెదిరింపులు, ఘర్షణలు, దాడులు లాంటివి చోటుచేసుకున్నాయి. పోలింగ్ ముందు రోజు రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ ఇవి కొనసాగాయి. అయితే, వీటిపై పోలీసులు స్పందించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలపై అధికారులు మేల్కొని తక్షణమే కేంద్ర బలగాలను పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే పోలింగ్ ను లైవ్ లో చూపిస్తున్న కొన్ని మీడియా ఛానెల్స్ మీద దాడి చేస్తున్నారు నాయకులూ.ఒక యాంకర్ ను అయితే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు.మరి ఎవరు ఎవరిని బెదిరించారో తెలుసుకుందామా.
ప్రధాన రాజకీయ పార్టీల తరఫున రౌడీషీటర్లు పాతబస్తీ, పశ్చిమ మండలంలో తమ తమ అభ్యర్థికే ఓట్లు వేయించారు. ఈ విషయంలో రౌడీషీటర్ జంగ్లీ యూసుఫ్ మరో అడుగు ముందుకేశాడు. తమ ప్రత్యర్థి పార్టీకి మద్దతు కూడగట్టేలా కార్యకలాపాలు నిర్వహిస్తారా? అంటూ ఓ టీవీ ఛానెల్ యాంకర్‌ను ఫోన్‌లో బెదిరించాడు. ప్రచారం నిర్వహిస్తే చంపేస్తానంటూ హెచ్చరించాడు. కరడుగట్టిన రౌడీషీటర్ జంగ్లీ తాను మద్దతు ప్రకటించిన పార్టీనే గెలవాలంటూ ఓ ఊర్దూ చానెల్‌లో పనిచేసే యువతిని ఫోన్‌లో బెదిరించాడు. ఆమె భర్త స్థిరాస్తి వ్యాపారి కాగా, అతడి సోదరుడు ఓ జాతీయ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థిని రెండు, మూడుసార్లు బెదిరించిన యూసుఫ్ తర్వాత తన దృష్టి వారి కుటుంబసభ్యుల వైపు మళ్లించాడు. వారిని బెదిరిస్తే కొంతైనా అభ్యర్థి ప్రచారంపై ప్రభావం ఉంటుందని అంచనా వేశాడు. ఈ క్రమంలో ఉర్దూ ఛానెల్‌లో పనిచేసే మహిళా యాంకర్‌ను ఎన్నుకుని, ఆమె వివరాలను సేకరణ బాధ్యతను ఇద్దరు అనుచరులకు అప్పగించాడు. వారు నాలుగు రోజుల కిందటే ఆమె ఫోన్ నంబరు, ఫేస్‌బుక్ వివరాలను అతడికి అందజేశారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
యూసుఫ్ ఆమెకు ఫోన్ చేసి.. నీ బావ, భర్త చేస్తున్న వ్యవహారాలు నాకు నచ్చడం లేదు. నేను మద్దతిస్తున్న పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తారా? అని ఆగ్రహించి, నీ బావను, భర్తను కాల్చి చంపుతా.. ఎవరు కాపాడతారో చూస్తానని బెదిరించాడు.అంతేకాదు, నేను చెప్పిన విషయాలను నీ భర్తకు, బావకు అర్థమయ్యేలా చెప్పు లేదంటే గంట గంటకు మేం చేసే చర్యలను నీకు చూపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అయితే, ఈ బెదిరింపులను ఆమె పట్టించుకోకపోవడంతో ఈసారి ఫేస్‌బుక్ ఖాతాలో సదరు యాంకర్ ఫొటోలను అసభ్యంగా పోస్ట్ చేశాడు. దీనికి కూడా ఆమె స్పందించక పోవడంతో ఆశ్లీల వీడియోల్లో ఆమె ఫొటోలను ఉంచి మళ్లీ పంపించాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు జంగ్లీ యూసుఫ్ కోసం గాలిస్తున్నారు. చూశారుగా ఈ రౌడీ ఎలా బెదిరించాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.యాంకర్ ను రౌడీ షీటర్ బెదిరించిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.