సోషల్ మీడియా రాజ్యమేలుతున్న తరుణంలో మంచికంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీ అందిపుచ్చుకుని సన్మార్గంలో నడవాల్సిందిపోయి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా యువత చాలా చెడు మార్గాల వైపుకు వెళ్తున్నారు. మూతి మీద మీసం మొలవనివాళ్ళు కూడా పెద్ద పెద్ద దారుణ చర్యలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఓ కంత్రీ కుర్రోడి వ్యవహారం బట్టబయలైంది. లేడీస్ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు తీశాడు. అలా ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్నవీడియోలు తీసి తన ట్యాబ్‌లో భద్రపరిచాడు. అసలు ఇది ఎలా వీలైంది. ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందాం.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏరియాలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు నివసిస్తూ ఉద్యోగాలు, విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు.ఈ హాస్టల్ పక్కనే ఓ బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో నుంచి అమ్మాయి హాస్టల్ రూమ్స్ క్లియర్ గా కనిపిస్తాయి. వాళ్ళు రూమ్ లలో ఏం చేస్తుంటారో చివరికి బాత్ రూమ్ లో చేసే పనులు కూడా అతనికి క్లియర్ గా కనిపిస్తాయి. ఆ భవనంలో నివసించే ఒక కంత్రీ కుర్రోడు ఈ అమ్మాయిలను గమనించేవాడు. వాళ్ళు ఏం చేసిన అతను చూసేవాడు. ఇలా చాలా రోజుల నుంచి తన మొబైల్ ఫోనులో అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే చిత్రీకరించాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది.వెంటనే హాస్టల్ వార్డెన్ కు చెప్పింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేక స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. అతని ఫోనులో ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.చూశారుగా ఈ కుర్రాడు ఎంతటి పని చేశాడో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.30 మంది అమ్మాయిల నగ్న చిత్రాలను తీసిన ఈ యువకుడి ఘటన గురించి అలాగే ఇలా నగ్న ఫోటోలను వీడియోలను సంపాదించి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే యువకుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.