ఈరోజుల్లో ప్రతి ఒకరికి వాహనం మీద చాలా ప్రేమ ఉంటుంది. మార్కెట్లో ఈరోజుల్లో మంచిమంచి వాహనాలు వస్తున్నాయి. కానీ చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా వాహనాలు నడుపుతుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ చాలా ప్రధానం కనుక కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ విషయం లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పు వాహనదారులకు శుభవార్త అనే చెప్పుకోవాలి.. ఉద్యోగాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, వాహన డ్రైవర్ల ట్రాఫిక్ వెతలు ఇక తీరనున్నాయి. దేశవ్యాప్తంగా 2019, జూలై నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుంది.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరుగా ఉన్నాయి. ఇకపై దేశమంతా ఒకే తరహా డ్రైవింగ్ లైసెన్సులు కనిపించబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమలులోకి తీసుకురానుంది. ఆ నిబంధనలు అమలులోకి వస్తే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు ఒకేలా మారనున్నాయి. రంగు, డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఒకే తరహాలో ఉంటాయి. ఈ స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి.
ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరుగా ఉన్నాయని, వాటి రంగులు, పార్మాట్లు పలు రకాలుగా ఉన్నాయని, అన్నింటినీ ఒకే తరహాలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం లైసెన్సులు ఉన్నవారంతా కొత్త లైసెన్స్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయితే కొత్త లైసెన్స్ తీసుకోవడం ఆప్షనల్ మాత్రమే. స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. ఇకపై జారీ చేసే లైసెన్సులు మాత్రం కొత్త ఫార్మాట్‌లో ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి వివరాలన్నీ చిప్‌లో సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఆ వివరాలు, జరిమానా ఆ చిప్‌లో సేవ్ అవుతాయి. పోలీసులు తనిఖీల సమయంలో ఆ చిప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల్ని తెలుసుకునే అవకాశముంటుంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అంతేకాదు… ట్యాక్స్, ఇన్యూరెన్స్, పీయూసీ వివరాలు కూడా ఆ చిప్‌లో స్టోర్ అవుతాయి. సో… త్వరలో మీ లైసెన్స్ రూపు రేఖలు మారనున్నాయన్నమాట.ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. డ్రైవింగ్ లైసెన్స్ ల విషయం మీద కేంద్రం తీసుకున్న ఈ కొత్త పద్ధతి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.