కొన్నికొన్ని పాటలు మనకు మనసుని హత్తుకునేలా ఉంటాయి.. అందుకే ఇలాంటి పాటలను మరి మరీ వింటూ ఉంటాము, ఇక కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఇటీవల మనసుని హత్తుకునేలా అందరి నోట వినిపిస్తున్నాయి..ముఖ్యంగా జానపద గీతాలతో ఇప్పుడు యువత మరింత ఉర్రూతలూగుతున్నారు.. అలాగే పార్టీల సమయంలో డీజేలతో సాంగ్స్ హోరెత్తిస్తున్నారు. ఇక తెలంగాణ లో ఓ సాంగ్ ఎప్పటికి నిలిచిపోయేలా ఉంటుంది. ఆ సాంగ్ వింటే యువత కేరింతలు కొడతారు, అదే ఓ పిల్లో మౌనికో సోట్టబుగ్లల చిన్నారి పాట,, ఈ సాంగ్ తెలంగాణలో ఎంతో ఫేమస్అయింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంగ్ వినని వారు ఉన్నారు అంటే అది ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి.
మహబూబాబాద్ జిల్లాలోని రూరల్ మండలం వీరారం తండాకు చెందిన బంజారా గాయకుడు వీరేందర్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. వీరేందర్ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ అనేక ఆల్బామ్‌లు రూపొందించారు. అందులో ‘ఓ పిల్లో…మౌనికో.. సొట్టబుగ్గల చిన్నారి’ పాటతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. కాగా, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య వినోద, కుమారుడు, కుమార్తె,తల్లిదండ్రులు ఉన్నారు. ఇక ఆయన మరణంతో వీరారం తండా ప్రజలు కన్నీరుమున్నీరు అయ్యారు.. తెలంగాణలో సినిమాలు వస్తే వాటిలో తన పాటలతో హోరెత్తిస్తాను అన్నాడు, ఇక ఇలా చిన్నవయసులోనే మరణించడం పై స్నేహితులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
తెలంగాణ యాస పై పట్టు ఉంది అని, అలాంటి ఓ గొప్ప వ్యక్తి చనిపోవడం చాలా బాధకారమని ఇక్కడ వారు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. ఇప్పటికే కొన్ని లక్షల మందకి ఆపాట చేరింది, ఇలాంటి గొప్ప వ్యక్తి చనిపోయినందుకు సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు చాలా మంది అభిమానులు.. మరి ఆయన అకాల మరణం పై ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కామెంట్ల రూపంలో తెలియచేయండి.