సెల్ఫీ, ఇప్పుడు ఎక్కడ వినిపించినా ఇదే, ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా పదిమంది గుంపుగా ఉన్నా సెల్ఫీలేనిదే ఆ మీటింగ్ ముగియదు.. అంతలా సెల్పీ క్రేజ్ పెరిగిపోయింది. ఇక అత్యుత్సాహానికి పోయి చావునోట్లో తలకాయ కూడా పెడుతున్నారు కొందరు.. ఏకంగా కొండల చివరన ప్రమాదపు అంచుల మూలన, ఇలా సెల్పీ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి విషాదం హైదరాబాద్ లో జరిగింది.
సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడ వద్ద జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది… హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన సూర్య భోపాల్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతని సోదరుడు చంద్ర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చిన సూర్య, సోదరుడు చంద్ర, అతడి స్నేహితులతో కలిసి ఆదివారం హిమాయత్ జలాశయం వద్దకు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.
ఇటీవల వచ్చిన బాహుబలి సినిమా షూటింగ్ జరిగిన గుంతల వద్దకు వెళ్లి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటున్న సూర్య ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తమ్ముడు చంద్ర అన్నను రక్షించేందుకు నీటి గుంతలోకి దూకాడు. అతడు కూడా మునిగిపోతుండడంతో స్నేహితుడు భార్గవ్ నీటిలోకి దూకి రక్షించే ప్రయత్నం చేశాడు. ఒకరిని ఒకరు రక్షించే ప్రయత్నంలో ముగ్గురూ మృతి చెందారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇది చూసి ఒడ్డున ఉన్న స్నేహితులు భయంతో వణికిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. కుమారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణం సెల్పీ అని తెలుస్తోంది ఈ సమయంలో స్నేహితులు పక్కన ఉండి వద్దు అన్నా ఫోటోల కోసం ప్రయత్నం చేసి ప్రమాదవశాత్తు మునిగిపోయారు అని స్నేహితులు తెలియచేశారు దీంతో వారి తల్లిదండ్రులుకన్నీరు మున్నీరు అయ్యారు ఇద్దరుకుమారులు ఒకే ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది స్నేహితులను రక్షించబోయి భార్గవ్ కూడా ప్రాణాలు వదిలాడు, చూశారుగా ఇలాంటి సెల్ఫీల కోసం మీ లైఫ్ నిమాత్రం రిస్క్ లో పెట్టకండి,ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించండి.