హీరోయిన్లంటే అభిమానులు ఎలా వుంటారో వేరే చెప్పక్కర్లేదు. ఎగబడిపోతారు. ఎక్కడయినా ఫంక్షన్లు జరుగుతుంటే వారిని చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పరుగులు పెడుతుంటారు. వందల మంది ఎగబడేసరికి వారిని అదుపుచేయలేక బాడీ గార్డ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సినిమా హీరోయిన్లతో ఒక్కటంటే ఒక్క ఫోటో అయినా దిగాలనే మోజు ఇప్పుడు ఒక ఫ్యాన్ కాస్త వికృతంగా ప్రవర్తించే దిశగా దారి తీసింది. సెల్ఫీ కోసం అని ఏకంగా బాత్ రూమ్ లోకే వెళ్ళాడు ఒక అభిమాని.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా..
ఇటీవల కాలంలో అభిమానుల అభిమానం హద్దులు మీరుతుంది..సెల్ఫీ మోజులో పడి ఏమి చేస్తున్నారో ఎక్కడన్నామో అని కూడా తెలియకుండా పోతుంది..తాజాగా 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న సెక్సిణి ఈషా గుప్తా బాత్రూమ్ లోకి వెళ్లి హల్చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయిన ఈషా ఫ్యాషన్ రంగం లో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల దుబాయ్ లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వెళ్లింది ఈ భామ..అయితే తన ర్యాంప్ వాక్ ముగించిన ఒకసారి బాత్రూమ్ కు వెళ్ళేతుండగా ఆమె వెంటనే ఒక అభిమాని పరిగెత్తుతూ రావడం కనిపించిందంట.
సర్లే అనుకుని ఆమె అలా లేడీస్ వాష్ రూమ్ వరకు వెళితే ఈ అభిమాని ఆమె వెంటే లోపలికి కూడా వచ్చేశాడట. ఒక్క సెల్ఫీ కావాలి ప్లీజ్ అంటూ మారాం చేశాడట. ఇది వాష్ రూమ్ కదా ఇక్కడ సెల్ఫీలు ఏంటి అని ఈషా ప్రశ్నించినా కూడా.ఆ విచిత్ర అభిమాని అస్సలు వినలేదట. దీంతో ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ వారికి చెప్పగా వారు అతడ్ని లొంగదీసుకున్నారు. కాకపోతే అతడు నిజంగానే సెల్ఫీ కోసం వచ్చాడని అనిపించడంతో ఈషా అతనిపై ఎటువంటి లీగల్ చర్యలూ తీసుకోలేదు. మొత్తానికి సెల్ఫీ పిచ్చితో ఆ అభిమాని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అసలే దుబాయ్ ఒకవేళ ఈషా కనుక కేస్ పెడితే అతడు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేది.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. సెల్ఫీ కోసం ఏకంగా బాత్ రూమ్ లోకి వెళ్లిన ఈ అభిమాని ఘటన గురించి అలాగే పబ్లిక్ లోకి సెలెబ్రిటీలు వచ్చినప్పుడు వారు ఎదుర్కొనే సమస్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.