పెద్ద నోట్ల విషయంలో మరో బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేసింది. కేవలం ముద్రణను మాత్రమే ఆపేసింది. అంటే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నోట్లు చలామణి అవుతూనే ఉంటాయి. అయితే రూ.2,000 నోట్ల చలామణిని మెల్లమెల్లగా తగ్గిస్తూ పూర్తిగా ఆపేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రూ.2,000 నోట్లను పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, అక్రమ నిల్వ కోసం ఉపయోగిస్తున్నారన్నది ప్రభుత్వం అనుమానం. అందుకే ముద్రణ ఆపేసింది. అయితే ముద్రణ ఆపేసినంత మాత్రాన రూ.2,000 నోట్లు చెల్లవని కాదు. అవి చెల్లుతాయి. చలామణిలో ఉంటాయి.
నవంబర్ 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు రూ.2,000 నోట్లను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు నగదు కొరతను తగ్గించడానికి రూ.2,000 నోట్లను విడుదల చేసింది. 2018 మార్చి నాటికి రూ.18.03 లక్షల కోట్ల నగదు మార్కెట్లో చలామణిలో ఉంటే అందులో 37 శాతం అంటే రూ.6.73 లక్షల కోట్లు రూ.2,000 నోట్లు కాగా, 43 శాతం అంటే రూ.7.73 లక్షల కోట్లు రూ.500 నోట్లు. మిగతావన్నీ చిన్న నోట్లు. రూ.2,000 నోట్లు రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని 2018 ఆగస్ట్‌లో స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపెయ్యడంతో… వాటిని రద్దు చేస్తారా అన్న అనుమానాలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి.. అయితే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేత అంశంపై రిజర్వు బ్యాంకు స్పందించలేదు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ప్రధాని మోదీ నల్లధనాన్నిఅరికట్టేందుకు 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక విపక్షాలు కూడా ఈ అంశంలో ప్రధాని మోదీ పై విమర్శలు చేశాయి.. అయితే మోదీ మరోసారి ఇలా నోట్ల రద్దు అనే నిర్ణయం తీసుకుంటారా అనే డైలమా కూడా ఇప్పుడు ఏర్పడింది. మరి చూడాలి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం ఉండదు అని అంటున్నారు అనలిస్టులు. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.