స్మార్ట్ ఫోన్ వాడితే బాగానే ఉంటుంది.. అలాగే స్మార్ట్ గా చాలా మంది కేటుగాళ్లు ఎత్తులు వేసి మన జేబులు గుల్ల చేస్తున్నారు.. ఇక ఆన్ లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అని చెప్పాలి.. ఇప్పుడు దేశ భద్రత చూసే ఆర్మీ జవాన్ల లా మారి నిలువు దోపిడీలు చేస్తున్నారు. మీకు తెలియకుండా మిమ్మల్ని నిలువుదోపిడి చేస్తున్నారు.. అసలు అనుమానం రాకుండా నిలువునా మిమ్మల్ని ఖాళీ చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే సైబర్ నేరాలతో ఆ రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నారు ఈముఠా.. రాజస్ధాన్ లోని భరత్ పూర్ జిల్లా కేంద్రంలో కొన్ని గ్రామాల వారు ఉన్నారు ..ఖమాన్ జురేహరా జీడ్ అనే ప్రాంతాల్లో కొందరు యువత సైబర్ నేరాలను వృత్తిగా ఎంచుకున్నారు.. ఇది పోలీసులు చెబుతున్న మాట.. ఇక్కడ 80 శాతం మంది యువత సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
వీరిని పట్టుకోవాలి అని పోలీసులు వెళితే వారిపై ఆయుదాలతో దాడి చేస్తున్నారు. చాలా పెద్దఎత్తున ఇలా నేరాలు చేస్తున్నారు..ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి నకీల ఐడీ కార్డులు సృష్టించి ఆర్మీ జవాన్లుగా గెటప్ వేస్తారు..ఇక ఐడీ కార్డులు అలాగే ఆర్మీ డ్రెస్సులతో కొత్తగా ఫోటోలు దిగుతారు. తర్వాత ఆన్ లైన్ మోసాలకు తెరతీస్తారు. ఇక్కడ వీరు చేసే ఆన్లైన్ మోసాల స్టైల్ చూస్తే మతిపోతుంది.అక్కడ అంతా అటవీ ప్రాంతం ఉంది.. వీరు ఉదయం ల్యాప్ ట్యాప్ తీసుకుని ఊరి చివర అడవి ప్రాంతంలోకి వెళతారు.. అక్కడ గ్రూపుగా ఉండి. గుబురు చెట్లపై కూర్చుంటారు.. పోలీసులు కొత్తవారు గ్రామంలో ఎవరైనా వస్తే చెట్ల పై ఉన్న వారు రహస్య ప్రాంతాల్లో ఉన్నవారికి చెబుతారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆన్ లైన్ మోసాలు చేస్తారు.. ఖరైదన కార్లు రాయల్ బైక్స్ ఉన్నాయి అని ఓయిలెక్స్ వెబ్ సైట్లో పోస్టు చేస్తారు..
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇలా చేసిన తర్వాత కస్టమర్స్ ఫోన్ చేయడంతో వారు చెప్పిన ప్లేస్ కు రావాలి అని చెబుతారు… దీంతో వారు ఎంత మంది వచ్చారు అని చూసి వారికి, ఏ బైక్ కారు నచ్చినా తాము చెప్పిన ప్లేస్ కు డబ్బులతో రావాలి అని చెబుతారు.. ఈ సమయంలో అటవీ ప్రాంతంలోకి రమ్మని చెబుతారు. అక్కడకు వచ్చిన తర్వాత చెట్లపై ఉన్న ఈ గ్యాంగు వెనుక పోలీసులు అనుమానితులు వస్తున్నారా అనేది చూస్తారు. ఇక ఎవరూ రావడం లేదు అని తెలిస్తే వారిని నిలువు దోపిడి చేస్తుంటారు..ఇక ఆర్మీ జవాన్లు అని ఇలా అనేక మందిని మోసం చేస్తున్నారు అని భాదితులు పోలీసులకు ఇటీవల కంప్లైంట్ చేస్తే వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేస్తున్నారు.. దీనిపై రాజస్ధాన్ ప్రభుత్వం కొత్త టీం ని ఏర్పాటు చేసి వీరిని అరెస్ట్ చేయాలి అని చెప్పింది.. మరి చూశారుగా ఈ గ్యాంగ్ ఎలాంటి పనులు చేస్తుందో. మరి ఇలాంటి వారిని పట్టుకునేందుకు వీరి ఆగడాలు ఆపేందుకు మంచి సలహా మీరు కూడా కామెంట్ల రూపంలో ఇవ్వండి.