Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఒక్క భార్య, 11 మందిని ఎలా సుఖ‌పెడుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

$
0
0

సమాజంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ బాధపడాల్సిన విషయమేమింటే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే అమ్మాయిలు కూడా ఈమధ్య మోసాలకు పాల్పడుతున్నారు. తమ అందాన్ని ఎరగా వేసి అందానికి బానిసయ్యే మగవాళ్ళను చాలా ఈజీగా లూటీ చేస్తున్నారు. ఇలా ఒక యువతి 11 మందిని ఎలా బురిడీ కొట్టించిందో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం అనే చెప్పాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె పేరు మేఘా భార్గవ్. ఉత్తరప్రదేశ్ లోని ఇండోర్ ఈమె స్వస్థలం. ఆమె అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెక్కిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం. ప్రేమంటే ఇదేరా అన్న బిల్డప్ ఇచ్చి పెళ్ళి చేసుకుందాం రా అని పిలుస్తుంది. ఆమె మాటలు నమ్మి పెళ్ళి చేసుకునేందుకు పెళ్ళి పీటలెక్కితే చాలు అక్కడి నుంచి అసలు కథ మొదలువుతుంది. పెళ్లి పీటలెక్కినవాడిని పీల్చి పీల్చి పిప్పి చేసి పారేస్తుంది. ఈ 22 యేళ్ళ మహిళ ధనార్జనగా వివాహాన్ని ఎంచుకుంది.పెళ్ళి కాని అబ్బాయిలను మాట్రిమొనిలో కనుక్కుని తన డీటైల్స్‌ను వారికి పంపిచేది యువతి. డబ్బున్న అబ్బాయిల్లో ఎవరైతే కొంచెం అంధవికారంగా ఉంటారో, విడాకులు తీసుకున్న వారు, అంగవైకల్యం కలిగి ఉన్నవారు… ఏదో ఒక లోపంతో వున్న వారిని ఆమె టార్గెట్ చేస్తుంది. పెళ్ళయిన కొద్దిరోజులు అనుకూలంగా నటించి.. ఆ కాలంలోనే అంతా అందినంత డబ్బు, నగలు అన్నీ దోచుకుని వెళ్ళిపోవడం ఆమె స్టైల్. ఈ ఘరానా మోసానికి ఆమె చెల్లి, బావ కూడా సహకరించడం కొసమెరుపు.

Image result for girls

మేఘ అందంగా ఉండటంతో అందమైన అమ్మాయి దొరికిందని భావించి ఆ యువతి గురించి అసలు వివరాలేవీ తెలియకుండా పెళ్ళి చేసుకున్నారు 11 మంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు ఈ యువతి మోసానికి బలయ్యారు. కొచ్చికి చెందిన లోరస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యతో పాటు 15 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలను కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె చెప్పే మాటలను విని ఆశ్చర్యపోయారు. ఇక ఇలా దాదాపు కోట్ల‌రూపాయ‌ల‌కు దోచేసింది ఈ కిలాడి. మ‌రి చూశారుగా ఇలాంటి మ‌హిళ‌ని ఏమి చేయాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles