Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

దయచేసి ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ..

$
0
0

పళ్లు తోముకునే బ్రష్‌ గొంతుకు గుచ్చుకోవడం సర్వ సాదారణంగా మంనం చూస్తూ ఉంటాం. ఏమరపాటుగా బ్రష్‌ చేస్తున్నప్పుడు పొరపాటున చిగుర్లకు బ్రస్‌ గుచ్చుకోవడం లేదంటే గొంతుకు గుచ్చుకోవడం జరుగుతుంది. కాని బ్రష్‌ మొత్తం గొంతులోకి వెళ్లి పోవడం, ఆ తర్వాత మింగడం అనేది జరగదు.కాని దేశ రాజధాని దిల్లీలో ఆ సంఘటన జరిగింది. అత్యంత విచిత్రంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చలనీయాంశం అవుతుంది. ఆ వ్యక్తి బ్రష్‌ మింగి పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఎవరికి చెప్పక పోవడం మరింతగా ప్రమాదం అయ్యింది.మరేమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for brushing teeth

దిల్లీ సీమపురికి చెందిన 36 ఏళ్ల ఒక వ్యక్తి బ్రష్‌ తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత గొంతును కూడా శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో గొంతులో బ్రష్‌ ఇరుక్కు పోయింది. దాంతో అతడు బ్రష్‌ను లాగేందుకు ప్రయత్నించగా, ఆ బ్రష్‌ మరింతగా జారి లోనికి వెళ్లి పోయింది.బ్రష్‌ కడుపులోకి వెళ్లడంతో ఆ వ్యక్తి పరువు పోతుందని భావించి ఎవరికి చెప్పలేదు. ఆ బ్రష్‌ మల ద్వారం ద్వారా అదే వస్తుంది లేని అని భావించాడు. కాని అది కాస్త తర్వాత రోజున తీవ్రమైన కడుపు నొప్పిగా మారింది. తీవ్ర కడుపు నొప్పి రావడంతో గురు త్యాగ్‌ బహదూర్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ అయ్యాడు. కడుపు నొప్పి విపరీతంగా వస్తుందంటూ ఆ వ్యక్తి హాస్పిటల్‌ లో జాయిన్‌ అవ్వడంతో ఎక్స్‌రే మరియు స్కానింగ్‌ చేశారు. కడుపులో ఏదో ఉందని వైధ్యులు గుర్తించారు.అప్పుడు తాను బ్రష్‌ను మింగినట్లుగా చెప్పాడు. అవాక్కయిన డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా ఆ బ్రష్‌ను తొలగించారు. పెద్దగా ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి పొట్టకు కింది బాగంలో చిన్న రంద్రం పెట్టి ఆ బ్రష్‌ను తొలగించినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. అంత పెద్ద బ్రష్‌ గొంతులోకి ఎలా వెళ్లిందో డాక్టర్లు కూడా తెలియక నోరెళ్లబెడుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ఘటనపై ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం అధికారి డాక్టర్ ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అతను బ్రష్ మింగేసిన విషయం డిసెంబరు 10న తెలిసింది. రెండు రోజులపాటు ఆ బ్రష్ అతని కడుపులోనే ఉంది. మా గ్యాస్ట్రోయంట్రలజిస్ట్ నిపుణులు ఎండోస్కోపీ ద్వారా అతని కడుపులో ఉన్న బ్రష్‌ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడిని అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం’’ అని తెలిపారు. ఇటీవల ఆగ్రాకు చెందిన గౌరవ్ అనే వ్యక్తి కూడా బ్రష్ మింగేసి ఆసుపత్రిపాలయ్యాడని, అతనికి కూడా ఎండోస్కోపీ ద్వారా చికిత్స అందించామని అగర్వాల్ తెలిపారు. బ్రష్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, నాలుక లోపలి భాగాన్ని శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌కు బదులు టంగ్ క్లీనర్ ఉపయోగించడమే ఉత్తమం అని ఆయన సూచించారు. చూశారుగా బ్రష్ ను మింగిన ఈ ఘనుడి ఘటన గురించి. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles