పువ్వులలోని మకరంద కోసం తుమ్మెదలు ఎంతలా ఆరాటపడి దాన్ని ఆస్వాదిస్తాయో.. తొలి కలయికను కూడా అంతలా ఆస్వాదించాలని నూతన దంపతులు ఆరాట పడుతుంటారు. తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. తొలి కలయిక కూడా అంతే మధురంగా ఉండాలని భావిస్తుంటారు. అయితే తొలిరోజు కలయిక రోజున అంటే శోభనం రోజున కలవాలా వద్దా అని చాలా మంది ఆడవాళ్ళూ ఆలోచిస్తారు. పెళ్లి చేసుకుంటున్నామని బయటకు ఎంత ఆనందంగా ఉన్నా.. ఆ తర్వాత జరిగే తొలిరాత్రి గురించి అందరూ కంగారుపడుతూనే ఉంటారు. భార్యాభర్తల దాంపత్య జీవితంలో శారీరక కలయిక అనేది జీవితంలో ఓ భాగం. ఇది పరీక్ష కాదు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి! జీవన గమనంలో అదొక ఘట్టం మాత్రమే. కాబట్టి పూర్వానుభవం ఉంటే మేలనే చెప్పుడు మాటలను పెడచెవిన పెట్టాలి. అలాగే, తొలి రాత్రికి ముందు అమ్మాయి, అబ్బాయిల్లో ఉండే భయాలు, ఆందోళనలు, అపోహలను పక్కనబెట్టాలి.
అపుడే తొలిరేయి కలయిక సాఫీగా జరిగిపోతోంది. శృంగార జీవితంలోని తొలి రోజు కలయికలో ఉన్న అనుభూతిని రూచిచూశాక ఇక వెనుదిరిగి చూసే ప్రసక్తే ఉత్పన్నకాదు. అయితే, తొలి కలయికలో భర్తకు సహకరించాలా? వద్దా? అనే సందేహం భార్యకు కలుగుతుంది. ఒకవేళ సహకరిస్తే పూర్వానుభవం ఉందనుకుంటారు. అందుకే తొలిసారి కలయికలో చిన్నపాటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అమ్మాయికే కాదు, అబ్బాయికీ అదే తొలి అనుభవం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాంటప్పుడు అతని చర్యలకు స్పందించే విషయంలో అయోమయం చెందరాదు. అన్నిటికంటే ముందు కొత్త దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇందుకోసం పెళ్లికి ముందు నుంచే అభిప్రాయాలు పంచుకోవాలి. ఒకవేళ మొదటి రాత్రి నాటికి ఇద్దరి మధ్య శారీరకంగా దగ్గరయ్యేంత చనువు ఏర్పడకపోతే ఒక వారం రోజుల సమయం తీసుకోవాలి. ఈ సమయాన్ని నెలల తరబడి కొనసాగించకూడదు. ఇలా మనసులు కలిసిన తర్వాత జరిగే తొలి కలయికలో ఎవరు ఎవర్నీ తప్పు పట్టే అవకాశం ఉండదని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విన్నారుగా తొలి కలయిక రోజున కలవాలో వద్దొ. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తొలి కలయిక విషయంలో మేము చెప్పిన సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.