Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

షర్మిల-ప్రభాస్ మీద దుష్ప్రచారం చేస్తున్నది వీళ్ళే …అంతుతేల్చనున్న T-పోలీసులు

$
0
0

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు షర్మిల చుట్టూ తిరుగుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న షర్మిళ.. ఒకే ఒక్క ఫిర్యాదుతో తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపారు. తనకు, సినీహీరో ప్రభాస్‌కు మధ్య సంబంధం ఉందంటూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు రాజకీయ లబ్ది కోసం తన క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ ప్రభాస్‌తో లింకు పెట్టి దుష్ర్పచారం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

రాజకీయ లబ్ది కోసం ఒక ఆడకూతురు క్యారెక్టర్ మీద దారుణమైన నిందలు వేయడం, ప్రభాస్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడిని ఇందుకు పావుగా వాడు కోవడం, ఇంతకంటే నీచం ఉండదని, ఇలాంటి ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది. వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణ మరింత వేగవంతం చేశారు. ఇలాంటి వార్తలు స్పృష్టించే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను ఆశ్రయించారు. షర్మిల వ్యవహారాన్ని వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. దీంతో వెంటనే స్పందించిన డిసిపి రఘువీర్ యూట్యూబ్ కు గూగుల్ కు వెంటనే లేఖ రాశారు.

షర్మిల మీద దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ ను నియంత్రించాలని షర్మిల ప్రభాస్ ల ఫోటోలను పెట్టి వీడియోలను రిలీజ్ చేస్తున్న వారి వివరాలను మాకు అందించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానెల్స్ పుట్టగొడుగుల్లా వస్తున్నాయని వాటిని నియంత్రించాలని రఘువీర్ అభిప్రాయపడ్డాడు. షర్మిల ఫిర్యాదుతో అధికారులు అలర్ట్ అయ్యారని ఈ వ్యవహారం మీద ఇంతకముందు ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న 23 ఛానెల్స్ ను గుర్తించామని వాటికి కారణమైన వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. గూగుల్ యూట్యూబ్ నుంచి మరొక రెండు వారాల్లో తమకు పూర్తీ వివరాలు అందుతాయని ఆ తర్వాత షర్మిల ప్రభాస్ మీద దుష్ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసుకుంటామని తెలిపారు. ఏ మహిళా అయినా ట్రోలింగ్ ఎదుర్కొంటే మాకు పిర్యాదు చెయ్యాలని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి రఘువీర్ తెలిపారు.చూడాలి మరి ఈ విషయంలో ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. షర్మిల ప్రభాస్ మీద వచ్చిన గాసిప్స్ గురించి అలాగే షర్మిల ఈ విషయం మీద ఇంతకాలానికి రియాక్ట్ అవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles