Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

కొడుకు గౌతమ్ తో “నాకింకా బ్రతకాలని ఉంది”అంటూ భావోద్వేగమైన బ్రహ్మానందం

$
0
0

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. హాస్య బ్రహ్మ అని ఆయనకు పేరు. బ్రహ్మానందం ఫేస్ చూస్తే చాలు నవ్వడం ఖాయం. తెరపై ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు, చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సరదాగా కాసేపు హాయిగా నవ్వుకోవడానికి చాలామంది బ్రహ్మానందం వీడియో క్లిప్పింగ్స్ చూస్తారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.1986లో జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, రజని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘అహ నా పెళ్ళంటా’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు బ్రహ్మానందం. ఆ సినిమా తర్వాత కమెడియన్‌గా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్‌లో బ్రహ్మానందంకు పోటీ లేరు అనే పేరు సంపాదించారు. దాదాపు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన బ్రహ్మానందం పేరు వింటేనే చాలు వెంటనే మనసు లోతుల్లోంచి పెదాలపై నవ్వు వచ్చేస్తుంది. అంతలా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.

 బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించడం టాలీవుడ్ ను కలవరపెడుతుంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ రమాకాంత్ పండా నేతృత్వంలోని వైద్యబృందం ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలిసింది.గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ తర్వాత బ్రహ్మానందం ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారు.నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు.అయినా కానీ ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ అని అటు టాలీవుడ్ ఇటు ప్రేక్షక లోకం కలవరపెడుతుంది. దాంతో ఆయన ఎలా ఉన్నాడో ఆయన కొడుకు గౌతమ్ మీడియాకు చెప్పాడు.

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తనయుడు హీరో గౌతమ్ వెల్లడించాడు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యుల సలహామేరకు శస్తచ్రికిత్స కోసం ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్’లో సోమవారం ఆపరేషన్ చేపించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చారని తనయుడు గౌతమ్ పేర్కొన్నాడు. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబుచేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్‌లు తండ్రితోపాటు ముంబైలో ఉన్నారు.బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.మరి బ్రహ్మానందం గురించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

 


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles