జబర్దస్త్’ కామెడీ షోలో అతి తక్కువ కాలంలో బాగా పాపులరైన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతో ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అతడు ఎంటరయ్యాక మిగతా టీమ్స్ రేటింగ్స్ పరంగా వెనకపబడిపోయారనే వాదన కూడా ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హైప్ ఆది జబర్దస్త్ కు దూరం అయ్యి చాలా రోజులు అయ్యింది. అయితే ఇప్పుడు అతను మళ్ళి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చేవారం వచ్చే ఎపిసోడ్ లో ఆది ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆది అంటేనే పంచులు కేరాఫ్ అడ్రెస్. అందుకే రీ ఎంట్రీ ఎపిసోడ్ లో అదిరిపోయే పంచులను సిద్ధం చేసుకున్నాడు.
వచ్చేవారంకు సంబందించిన ఒక ప్రోమోను విడుదల చేశారు జబర్దస్త్ యాజమాన్యం. ఆ ప్రోమోను గమనిస్తే ఆది రీ ఎంట్రీ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది రాగానే స్టేజ్ మీద పూల వర్షం కురిపించారు. ఆ తర్వాత పంచులతో విరుచుకుపడ్డాడు. యాంకర్ అనసూయను జడ్జి రోజాలను అడ్డు పెట్టుకుని తనదైన శైలిలో పంచులు వేశాడు. జడ్జి రోజాతో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేశాడు. మీరు అమ్మాయి కాదు ఆంటీ అంటూ రోజాకు సెటైర్ వేశాడు. దాంతో రోజా అమ్మాయి అని నిరూపించుకోడానికి స్టేజ్ మీదకు వచ్చి డాన్స్ చేసింది. అంతటితో ఆగకుండా అనసూయ చెల్లెలిని తీసుకొచ్చి నానా హంగామా స్పృష్టించాడు ఆది. మీ చెల్లి మీద మనసు పారేసుకున్న ఐ లవ్ యువర్ సిస్టర్ అంటూ అనసూయకు చెప్పి షాక్ ఇచ్చాడు ఆది.అనసూయకు అనసూయ చెల్లెలు మీద లవ్ సెటైర్స్ వేస్తూ బాగానే అలరించాడు.
మొత్తానికి ఆది రీ ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ కు కొత్త కల వచ్చిందనే చెప్పుకోవాలి. ఆది రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి వచ్చే వారం ఎపిసోడ్ లో హైపర్ ఆది ప్రేక్షకులను ఎలా రంజిపజేస్తాడో చూడాలి అని ప్రేక్షకులు చాలా అతృతతో ఉన్నారు. చూడాలి మరి ఆది ఎలా రెచ్చిపోతాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హైపర్ ఆది గురించి ఆయన రీ ఎంట్రీ గురించి రీ ఎంట్రీలో రెచ్చిపోయి పంచులు వెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.