Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

మెట్రోలో అందరు ప్యాంట్స్ విప్పి ప్రయాణించారు ఎందుకో తెలిస్తే షాక్

$
0
0

వెర్రి వెయ్యి విధాలంటే ఇదే కాబోలు. అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించేవారు.. ఫ్యాంట్‌లు, స్కర్టులు విప్పి రావాలంటూ ఓ సంస్థ పిలుపివ్వడంతో అంతా అదేబాట పట్టారు. షర్టు, అండర్‌వేర్ మాత్రమే ధరించి మెట్రోలో ప్రయాణించారు. అంతేకాదు, సెల్ఫీలు తీసుకుని సందడిగా గడిపేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వందలాది మంది ప్రయాణికులు ఫ్యాంటులు లేకుండా మెట్రోలో ప్రయాణించడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ‘నో ట్రౌజర్’ ఈవెంట్‌లో భాగంగా లండన్, బెర్లిన్ తదితర నగరాల్లోని ప్రజలు ఇలా ఫ్యాంట్లు విప్పి తిరగడం ఆనవాయితీగా మారింది. వాస్తవానికి ఈ వెర్రి ఈవెంట్ అమెరికాలోని న్యూయార్క్‌లో 2002 సంవత్సరంలో ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ పేరుతో మొదలైంది. అండర్ గ్రౌండ్ మెట్రోలలో ప్రయాణించేవారు ఒక రోజంతా ఫ్యాంట్లు ధరించకూడదు. ఇది దావనంలా వ్యాపించి ప్రపంచంవ్యాప్తంగా 60 నగరాలను తాకింది.

లండన్‌లో ఫ్యాంట్‌లు విప్పి ప్రయాణించేవారంతా ట్రాఫాల్‌గర్ స్క్వేర్‌లోని నేషనల్ గ్యాలరీ నేషనల్ గ్యాలరీ వద్దకు చేరుకుంటారు. ఫొటోలు, వీడియోలకు ఫోజిలిస్తూ కాసేపు సందడి చేస్తారు. అక్కడి నుంచి అంతా ది చాందోస్ పబ్‌కు చేరుకుంటారు. లండన్‌లో ఈ కార్యక్రమాన్ని ‘స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ’ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇదేదో మంచి పని కోసమో, అవగాహన కల్పించడం కోసమో, ప్రజల్లో ఛైతన్యం తీసుకురావడానికో చేస్తున్న కార్యక్రమం కాదు. ప్రజలంతా ఒక రోజు ఫన్నీగా గడపాలనేదే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

‘‘సాధారణ రోజుల్లో ఫ్యాంట్ విప్పి బయట తిరిగే అవకాశం రాదు. ఒక వేళ వచ్చినా చాలా సిగ్గుగా ఉంటుంది. కానీ, ఈ రోజు చాలామంది ఫ్యాంట్‌లు లేకుండా మెట్రోలో ప్రయాణిస్తారు. దీనివల్ల మాకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతేకాదు, చాలా ఫన్నీగా, సరదాగా కూడా ఉంటుంది’’ అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. అమెరికాలోని కొంతమంది నిర్వాహకులు దీన్ని ఫేస్‌బుక్ ద్వారా పాపులర్ చేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు.. మెట్రో తలుపులు మూతపడగానే తమ ఫ్యాంట్‌లు విప్పేయాలని, ఎవరైనా ప్రశ్ని్స్తే తమకు రైలు చాలా అసౌకర్యంగా ఉందని చెప్పాలంటూ టాస్క్‌లు ఇస్తారు. అమెరికాలో ఏటా మే 3న, బ్రిటన్‌లో జనవరి 13న దీన్ని నిర్వహిస్తున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదే కాబోలు.వినడానికే చాలా విడ్డురంగా ఉంది కదా. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ప్యాంట్స్ విప్పి ప్రయాణించే ఈ ఈవెంట్ గురించి అలాగే ఇలా విచిత్రమైన ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

 


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles